Drug Sales in Hyderabad: పాతబస్తీ బహదూర్‌పూర్‌లో డ్రగ్స్ పట్టివేత సంచలనంగా మారింది. బెంగళూరు నుంచి MDMA డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ కు చెందిన దంపతులు అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇన్‌స్టాగ్రామ్‌లో సయ్యద్, ఊన్నీసాలే నిందితులు పరిచయమయ్యారు. నాలుగేళ్లుగా సయ్యద్ దంపతులు డ్రగ్స్‌ను అమ్ముతున్నారు. రేవ్ పార్టీలతో పాటు పబ్బులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లతో పాటు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. 3 నెలల్లో 19 మంది ప్రముఖులకు సయ్యద్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. ట్రాన్స్‌ఫోర్ట్ ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తెలిపారు. గతంలోనూ సయ్యద్ దంపతులు పలుమార్లు అరెస్టైనట్లు గుర్తించారు. సయ్యద్ దంపతులతో పాటు మరో నలుగురిని టీఎస్ న్యాబ్ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Read also: Chandrababu: విద్యా కానుక కిట్లను త్వరగా పంపిణీ చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
భాగ్య నగరంలో పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఉక్కుపాదం మోపుతున్నా.. డ్రగ్ రాకెట్లు బయటపడుతూనే ఉన్నాయి. మత్తుకు బానిసగా మారిన యువత ను టార్గెట్ చేసుకున్న మాఫియా.. చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని పెంచుకుంటున్నారు.. డబ్బుల కోసం భావితరాల యువతను నాశనం చేస్తున్నారు.. ఉడుకు రక్తం యువత ఆ మత్తుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు దేశ ద్రోహులుగా కూడా మారుతున్నారు.. కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాలకు యువతను బానిసలుగా మారుస్తున్నారు..
Read also: Rajanna Sircilla: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వద్ద ఆశా వర్కర్ల ధర్నా..
మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దంటున్నారు పోలీసులు, నిపుణులు. దేశానికి ఆదర్శంగా నిలవాల్సిన యువత డ్రగ్స్ మాయలో పడటం దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా యువతను రక్షించడం కోసమే హైదరాబాద్ పోలీసులు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఒకవేళ డ్రగ్స్ కేసులో దొరికితే జీవిత ఖైదు, లేదా ఉరి శిక్షలు ఉంటాయాన్ని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా అధికారుల మాటలు పక్కనపెట్టి యువత డ్రగ్స్ అమ్మకాలు జోరుగా సాగిస్తుంది. ఇటువంటి ఘటన పాతబస్తీ బహదూర్ పూర్ లో చోటుచేసుకుంది.
Virat Kohli: ఐపీఎల్‌లో రెచ్చిపోయాడు.. ప్రపంచకప్‌లో తేలిపోయాడు! కోహ్లీకి ఏమైంది?