Bandi Sanjay: తెలంగాణలో కూడా గుజరాత్ ఫలితమే పునరావృతమవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: గుజరాత్ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అవినీతి ప్రభుత్వాన్ని ఓడించక తప్పదన్నారు. అభివృద్ధి చేసే వారే గెలుస్తారని బండి సంజయ్ అన్నారు. అవినీతిపరులు పతనం అవుతారని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో
బండి సంజయ్ పాదయాత్ర 11వ రోజు కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట్ విడి నుండి బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర” ప్రారంభమైంది. ఈ పాదయాత్ర సిర్పూర్, నడికుడ, రాఘవపేట, హుస్సేన్ నగర్, ముత్యంపేట మీదుగా వేంపేట వరకు కొనసాగనుండగా.. బండి సంజయ్ వేంపేట సమీపంలో రాత్రి బస చేయనున్నారు. బండి సంజయ్ పాదయాత్ర ఈరోజు మొత్తం 12.6 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఈసందర్బంగా మాట్లాడుతూ.. గుజరాత్ లో గతంలో కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి సంతోషంగా ఉందని అన్నారు.
Read also: Dhamaka: ఇది మాస్ మహారాజ ఊరమాస్ జాతర…
Also Read
- N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్‌పై బీజేపీ చీఫ్ ఫైర్
- TPCC: సీఎం రేవంత్‌రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్‌పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
- Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్‌తో తానూ ఆత్మహత్య
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
ఫలితాల కోసం ప్రపంచం దృష్టంతా గుజరాత్ మీదే ఉందని తెలిపారు. అన్ని పార్టీలు ఒకటై మోడీ గారి ఇమేజ్ను బ్యాడ్ చేసేందుకు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారని తెలిపారు. బీజేపీకి అధికారం ఇస్తే ఏ విధంగా ఫలితాలు వస్తాయో గుజరాత్ ఫలితాలు తెలుపుతున్నాయని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ రాబోయే రోజుల్లో విజయ పరంపర కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుజరాత్ గురించి చాలాసార్లు మాట్లాడారు ఏమి అభివృద్ధి అని అన్నాడు స్పందన చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని సంతోషం వ్యక్తం చేశారు. మునుగోడులో ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా ఎంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేసిన మెజార్టీ లేదని బం సంజయ్ పేర్కొన్నారు.
Girlfriend Attacks Boyfriend: సీన్ రివర్స్.. ప్రియుడ్ని బ్లేడ్ తో దాడిచేసిన ప్రియురాలు
తాజావార్తలు
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
-
Janvi : డర్టీ ఇమేజ్ నుంచి బయట పడాల్సింది పోయి ఇవేం పనులు జాన్వీ?
-
Beggar Woman’s Surprising Savings: జీవితాంతం వీధుల్లో భిక్షాటన చేసిన మహిళ.. మరణానంతరం బయటపడ్డ రూ.8.40 లక్షలు!
-
Violence Unlimited : సినిమా రంగానికి బాధ్యత లేదా?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!