Dhamaka: ఇది మాస్ మహారాజ ఊరమాస్ జాతర…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమాకా’. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్, ‘ధమాకా’ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఇప్పటికే ధమాకా నుంచి మూడు పాటలు రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ హిట్ అవ్వగా, ఈ మూవీ నుంచి నాలుగో పాట ‘దండ కడియాల్’ని మేకర్స్ విడుదల చేశారు. ముందొచ్చిన ‘జింతాక్’ పాటలో ఉన్న జోష్ కన్నా 100 రెట్ల ఎక్కువ ఎనర్జీ ఈ ‘దండ కడియాల్’లో ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మరో అదిరిపోయే మాస్ నంబర్ ఇచ్చాడు. థియేటర్స్ లో ‘దండ కడియాల్’ సాంగ్ రవితేజ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేయడం గ్యారెంటి.
ఈ ‘దండ కడియాల్’ సాంగ్ కి భీమ్స్ సెసిరోలియో లిరిక్స్ రాసి… ‘సాహితీ చాగంటి’, ‘మంగ్లీ’తో కలిసి పాడడం విశేషం. సాంగ్ ఏ సూపర్ గా ఉంది అంటే, లిరికల్ వీడియోలో అక్కడక్కడ చూపించిన డాన్స్ బిట్స్ ఇంకా బాగున్నాయి. ‘జానీ మాస్టర్’ మాస్ మహారాజ కోసం సూపర్ స్టెప్స్ ని కంపోజ్ చేశాడు, సాంగ్ చూడడానికి చాలా కలర్ ఫుల్ గా ఉంది. రవితేజ సాంగ్ లో మాంచి జోష్ లో కనిపించాడు, శ్రీలీలా డాన్స్ మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించే రేంజులో ఉంది. ‘దండ కడియాల్’ సాంగ్ తో ధమాకా సినిమా ఖాతాలో మరో చార్ట్ బస్టర్ చేరింది. ఇక సాంగ్ లో రవితేజ ఫాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తూ ధమాకా ట్రైలర్ ని డిసెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
మరో మూడు వారాల్లో ఆడియన్స్ ముందుకి రానున్న ‘ధమాకా’ సినిమాని రవితేజ ముందెన్నడూ లేనంతగా ప్రమోట్ చేస్తున్నాడు. చిత్ర యూనిట్ అంతా షోస్, ఈవెంట్స్ కి వెళ్తుంటే… ఎప్పుడూ ప్రీరిలీజ్ ఈవెంట్ లో, కొన్ని కామన్ ఇంటర్వ్యూస్ లో మాత్రమే మాట్లాడే రవితేజ ఈసారి ‘ధమాకా’ సినిమాని ముందుండి ప్రమోట్ చేస్తున్నాడు. నెల రోజుల ముందు నుంచే రవితేజ ఒక సినిమాని ప్రమోట్ చేయడం ఇదే మొదటిసారి. మరి ఈ మూవీతో మాస్ మహారాజ్ హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు