Boy in Bore Well : బోరుబావిలో పడిన బాలుడు.. 39 గంటలుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో బోరుబావిలో బాలుడు పడిన ఘటనలు మళ్లీ చోటు చేసుకుంటున్నాయి. గతంలో బోర్లు వేసి అందులో నీళ్లు పడకపోవడంతో నిర్లక్ష్యంగా వదిపెట్టడంతో.. తెలియక వెళ్లిన చిన్నారు అందులో పడి నరకయాతన అనుభవిస్తూ మృత్యువాతపడుతున్నారు. అయితే తాజాగా.. ఛత్తీస్‌గఢ్ లోని జాంజ్ గిర్ -చంపా జిల్లాలో 80 అడుగుల లోతు బోరు బావిలో రాహుల్ అనే 11 ఏళ్ల బాలుడు పడిపోయాడు. రాహుల్ ను కాపాడేందుకు గుజరాత్ కు చెందిన రోబోటిక్ టీమ్ రంగంలోకి దిగింది. మాట్లాడలేని, వినలేని సదరు బాలుడు శుక్రవారం సాయంత్రం బోరుబావిలో పడిపోవడం అందరినీ కలిచివేస్తోంది. ఇప్పటికి 39 గంటలు గడిచిపోయాయి.
అయితే ఇప్పటికే.. బాలుడ్ని కాపాడేందుకు రోబోటిక్ టీమ్ తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన సూరత్ కు చెందిన రోబోల బృందానికి తగిన సూచనలు చేసినట్టు చత్తీస్ గఢ్ సీఎం బూపేష్ బాఘల్ తెలిపారు. గుజరాత్ కు చెందిన మహేష్ అహిర్ తన బోరుబావి రెస్క్యూ రోబో ఆవిష్కరణను ట్వీట్ చేశాడని, అతడు రాహుల్ ను కాపాడగలడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చిన్నారిని రక్షించేందుకు అతడి సాయాన్ని తీసుకుంటున్నట్టు చెప్పారు. బోరు బావికి సమాంతరంగా క్రేన్ల సాయంతో మట్టిని తోడి పోస్తున్నారు.
Also Read
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
ఈ క్రమంలో ఒక గట్టి రాయి తగిలింది. దాన్ని పగలగొట్టడం కూడా వారికి సవాలుగా మారింది. రాళ్లను బద్దలు కొట్టే మెషినరీని తీసుకొచ్చారు. బాలుడిని కాపాడేందుకు మరో 10 నుంచి 15 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఘటనను సమీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రక్షణ లేకుండా వదిలేసిన అన్ని బోర్ వెల్స్ ను మూసివేయాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!