After Breaking Up With Ishan Khattar Now Ananya Panday Dating Aditya Roy Kapoor: బాలీవుడ్‌లో బ్రేకప్స్, ఎఫైర్స్ అనేవి సర్వసాధారణం. ఎప్పుడు ఎవరు కలిసి ఉంటారో, ఎప్పుడు విడిపోతారో అస్సలు ఊహించలేం. రాత్రికి రాత్రే బ్రేకప్స్ చెప్పుకొని, ఆ మరుసటి రోజే మరొకరితో ఎఫైర్స్ నడుపుతుంటారు. తెరముందేమో తాము కేవలం స్నేహితులమేనని చెప్పుకుంటూ.. తెరవెనుక మాత్రం చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటారు. ఇప్పుడు ఈ జాబితాలో లైగర్ బ్యూటీ అనన్యా పాండే కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. ఈ అమ్మడు కూడా బట్టలు మార్చుకున్నంత ఈజీగా.. బాయ్‌ఫ్రెండ్‌ని మార్చేసిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో.. అనన్యా పాండే ఈ ప్రేమ వ్యవహారాలకు దూరంగానే ఉంది. కానీ, ఇంతలోనే ఈ భామ సీక్రెట్‌గా ఓ నటుడితో ప్రేమలో ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. అతనెవరో కాదు.. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తార్. అతనితో ఈ భామ ఏకంగా మూడేళ్లు ప్రేమాయణం నడిపింది. ఈ జోడి ఎంతలా ప్రేమలో మునిగితేలిందంటే.. వీళ్లు పెళ్లి చేసుకుంటారేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమించేసుకున్నారు. అలాంటి వీరి మధ్య ఎవరో చిచ్చు పెట్టారో, ఎలాంటి విభేదాలు తలెత్తాయో తెలీదు కానీ.. ఉన్నట్టుండి బ్రేకప్ చెప్పేశారు. ఈ వార్త అందరినీ ఒకింత షాక్‌కి గురి చేసింది. బహుశా కెరీర్‌పై దృష్టి పెట్టేందుకే, విడిపోయారేమోనని అంతా అనుకున్నారు.
కట్ చేస్తే.. లేటెస్ట్‌గా అనన్యా పాండే మరో స్టార్ హీరోతో ప్రేమాయణం నడుపుతున్నట్టు గుట్టు రట్టయ్యింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనుకుంటున్నారా? ఆషికీ-2తో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ఆదిత్య రాయ్ కపూర్. కొంతకాలం నుంచి వీళ్లిద్దరు కలిసి తెగ చక్కర్లు కొడుతున్నారు. అప్పుడే వీళ్లు ఎఫైర్‌లో ఉన్నారేమో? అనే గాసిప్పులు గుప్పుమన్నాయి. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌కి ఇద్దరూ కలిసి హాజరు కావడం, ఓ జోడీలాగే మెలగడం చూసి.. వీళ్లు ప్రేమలో ఉన్నారని క్లారిటీ వచ్చేసింది. మరి, వీరి ప్రేమాయణం పెళ్లి పీటలు ఎక్కుతుందా? లేక మూణ్నాళ్ల ముచ్చటేనా? లెట్స్ వెయిట్ అండ్ సీ!