కొత్త జిల్లాల్లో జిల్లా జడ్జి కోర్టులు.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఏర్పడిన కొత్త జిల్లాలో త్వరలోనే జిల్లా జడ్జి కోర్టులు ఏర్పాటుచేస్తామని, దీనిపై హైకోర్ట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జి కోర్టులను సత్వరమే ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేయాలని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. మంగళవారం అరణ్య భవన్ లో న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి సమావేశమై కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టుల ఏర్పాటు ప్రక్రియపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలు, బాధితులకు సత్వరమే న్యాయం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.
Also Read
కొత్త జిల్లాల్లో జిల్లా జడ్జి కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర హైకోర్టు త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. కొత్తగా ఏర్పడిన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మినహా మిగిలిన అన్ని కొత్త జిల్లాల్లో ఇప్పటికే అదనపు జిల్లా జడ్జి కోర్టులు ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర హైకోర్టు ఇదివరకు తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా కోర్టుల ఏర్పాటు ప్రక్రియ పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. ఆయా కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న అదనపు జిల్లా కోర్టుల ప్రాంగణంలోనే కొత్తగా జిల్లా కోర్టులు ఏర్పడనున్నాయి.
ఉమ్మడి జిల్లా కోర్టులో ఉన్న కేసులన్నింటిని ఆయా జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా కోర్టులకు … ఆయా జిల్లాల పరిధిలోని కేసులను బదిలీ చేయనున్నారు. వివిధ అంశాలపై కోర్టులను ఆశ్రయించే వారికి సకాలంలో న్యాయం అందించేందుకు కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా కోర్టులు దోహదం చేయనున్నాయి. కొత్త జిల్లా కోర్టుల ఏర్పాటుతో బాధితులకు తక్కువ సమయంలో న్యాయం అందించేందుకు వీలు కలుగనుంది.
తాజావార్తలు
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Royal Enfield Continental GT 650: రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 రిలీజ్.. USB Type-C ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!
-
India Independence Day 1947: స్వాతంత్య్రపు తొలి ఉదయం.. ఢిల్లీ చూసిన ఆ అపూర్వ దృశ్యం
-
iQOO Smartphone: భారీగా పెరిగిన iQOO స్మార్ట్ఫోన్ల ధరలు.. iQOO 15, 15R, Neo 10 కొత్త ధరలు ఇవే!
-
India 1947 to 2026: 79 ఏళ్ల స్వతంత్ర భారతం.. 1947 నుంచి 2026 వరకు దేశాన్ని మార్చిన 80 కీలక ఘట్టాలు ఇవే
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!