తెలంగాణలో ఏర్పడిన కొత్త జిల్లాలో త్వరలోనే జిల్లా జడ్జి కోర్టులు ఏర్పాటుచేస్తామని, దీనిపై హైకోర్ట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జి కోర్టులను సత్వరమే ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేయాలని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.…