Police Firing: చైన్ స్నాచర్లపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒక వైపు హత్యలు, ఆత్మహత్య, మరో వైపు దొంగతనాలతో నగరం అట్టుడుకింది. వారం రోజుల్లోనే 7 హత్యలు 2 హత్యా యత్నాలు జరగడంతో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. గల్లీ..గల్లీలో తనిఖీలు చేస్తున్నారు. అనుమాతులను ప్రశ్నిస్తూ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలుపుతున్నారు. అయితే సైదాబాద్ లో చైన్ స్నాచర్లు, పోలీసుల దాడి సంచలనంగా మారింది. స్నాచర్లను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరుపుతున్నారు.
Read also: HDFC: హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు అలర్ట్..యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎమ్ఎస్ లు బంద్..!
రెండు రోజుల క్రితం చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు జరిపారు. తాజాగా సైదాబాదులో పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులను చూసిన చైన్ స్నాచర్లు తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే స్నాచర్ ను పట్టుకునేందుకు పోలీసులు వెంటబడ్డారు. దీంతో చైన్ స్నాచర్ గ్యాంగ్ పోలీసులపై దాడి చేశారు. దీంతో పోలీసులు చాక చక్యంగా వారినుంది తప్పించుకుని స్నాచర్లను పట్టుకున్నారు. వీరందరూ అమీర్ గ్యాంగ్ గా గుర్తించారు. అమీర్ గ్యాంగ్ ను పట్టుకునేందుకు రెండు రౌండ్ల పోలీసులు కాల్పులు జరిపారు. చైన్ స్నాచర్ అమీర్ ని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అమీర్ గ్యాంగ్ నగరంలో పలు చోట్లు స్నాచింగ్ పాల్పడినట్లు గుర్తించారు. ఎప్పటి నుంచి నగరంలో చోరీలకు పాల్పడ్డారనే దానిపై ఆరా తీస్తున్నారు.
మరో వైపు జవహర్ నగర్ లో సెల్ ఫోన్ స్నాచర్లు రెచ్చిపోయారు. బైక్ లపై వచ్చి.. కింద పడినట్టు నటించి, జేబులో నుంచి సెల్ ఫోన్లు దొంగలించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డ, దమ్మాయిగూడలో వరుస స్నాచింగ్ లు జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా స్నాచర్ల ను గుర్తించి పట్టుకున్న పోలీసులు. చైన్ స్నాచర్ల తరహాలో ఇటీవల పెరిగిన సెల్ ఫోన్ స్నాచింగ్ లు. బైక్ కింద పడ్డట్టు చేసి.. సెల్ ఫోన్ దొంగిలిస్తున్న సీసీ ఫుటేజ్ లో దృష్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ప్రజలకు ఇటువంటి వారి నుంచి అప్రమత్తంగ ఉండాలని చూసిచించారు.
Tollywood Producers: స్పెషల్ ఫ్లయిట్‌లో గన్నవరంకు టాలీవుడ్ బడా నిర్మాతలు.. ఎందుకో తెలుసా?