హరిభూషణ్ భార్య అందుకే లొంగిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మావోయిస్టు కీలక నేత హరిభూషన్ భార్య సమ్మక్క అలియాస్ శారద లొంగిపోయిన విషయాన్ని అధికారికంగా వెల్లడించారు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి… 1994లో 18 ఏళ్ల వయస్సులోనే పాండవ దళంలో కమాండర్‌గా పనిచేస్తున్న హరిభూషన్… శారదను మైనర్‌గా ఉన్నప్పుడే పార్టీలోకి తీసుకెళ్లారని తెలిపారు. ఆమె కిన్నెర దళంలో 1997 నుండి 1998 వరకు పనిచేసిందని వెల్లడించిన ఆయన.. 1999-2000 మధ్య నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ మెంబర్‌గా… ప్లాటున్ మెంబర్‌గా పనిచేశారన్నారు.. 2008లో వరంగల్ ఎస్పీ ముందు లొంగిపోయిన ఆమె.. 2011లో తిరిగి పార్టీలో చేరిందన్న డీజీపీ.. 2016లో చర్ల ఏరియా సెక్రటరీగా ప్రమోట్ అయ్యారన్నారు.. పెళ్లి చేసుకోవాలని హరిభూషన్ బెదిరించారని తెలిపారు.. ప్రస్తుతం బ్యాక్ పెయిన్, ఐ సైట్, కడుపునొప్పితో ఆమె బాధపడుతోందన్న మహేందర్‌రెడ్డి.. హరిభూషన్ బతికిఉన్నంత కాలం ఈమెకు పార్టీలో ప్రాధ్యన్యం ఉండేది.. కానీ, ఆ తర్వాత గుర్తింపు లేకుండా పోయిందన్నారు.
ఇక, ఆరు నెలల్లో పార్టీని 20 మంది వదిలివెళ్లినట్టు పోలీసులకు పేర్లతో సహా శారద చెప్పిందన్నారు డీజీపీ మహేందర్‌రెడ్డి.. 25 కేసుల్లో నింధితురాలిగా ఉన్న ఆమె.. 6 సార్లు పోలీసుల ఎదురుకాల్పుల్లో పాల్గొన్నదని.. బులెట్ గాయం అవడంతో.. అప్పట్లో కంటిచూపు పూర్తిగా కోల్పోయిందన్నారు.. మరోవైపు.. కోవిడ్ తర్వాత మావోయిస్టులకు సరియైన చికిత్స అందట్లేదన్న ఆయన.. ఆరోగ్య కారణాలతో చాలా మంది పార్టీని వదిలి వస్తున్నారని తెలిపారు.. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవండి… ప్రభుత్వం ఆదుకుంటుంది అని ప్రకటించారు.. ఇక, శారదా పేరుపై ఉన్న రూ. 5 లక్షల రివార్డును డీడీ రూపంలో ఆమెకే అందజేశారు డీజీపీ మహేందర్‌రెడ్డి.. ఇక, రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ ఆరోగ్యం బాగాలేదని తెలుస్తుంది.. లొంగిపోవాలని అప్పీల్ చేస్తున్నాం.. తన భర్తకి సరైన వైద్యం మావోయిస్టు పార్టీ ఇప్పించలేకపోయిందని శారద బాధపడుతుంది.. మరొకరు అలా ఇబ్బంది పడొద్దన్నారు.. కోవిడ్ కారణంగా పార్టీలో 10 మంది చనిపోయారని తెలిపిన డీజపీ.. తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు రావటానికి ప్రయత్నం చేయట్లేదని.. ఇప్పుడంతా ఛత్తీస్ ఘడ్ లో ఉన్నారని తెలిపారు..
Also Read
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
- Off The Record : సొంత ప్రభుత్వమైనా తగ్గేదే లే.. దొంతి మాధవరెడ్డి రూటే సెపరేటు!
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్‌లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?