Thalapathy Vijay: స్టార్ హీరో విజయ్‌పై కేసు నమోదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police case filed against Thalapathy Vijay: చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌పై కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాడని సెల్వం అనే సామాజిక కార్యకర్త విజయ్‌పై ఫిర్యాదు చేశారు. విజయ్ వల్ల తమకు తీవ్ర ఇబ్బంది కలిగిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎన్నికల కోసం రష్యాలో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన విజయ్.. తాజాగా చెన్నై వచ్చాడు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఏప్రిల్ 19న పలు రాష్ట్రాల్లో తొలి విడత పోలింగ్ జరిగింది. ఇందులో తమిళనాడు కూడా ఉంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. రష్యాలో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి చెన్నై వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి కారులో బయలుదేరిన విజయ్.. నీలాంగరై పోలింగ్ బూత్‌కు చేరుకున్నాడు. విజయ్ పోలింగ్ కేంద్రానికి రాగానే అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆయను చూసేందుకు ఎగబడ్డారు.
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
Also Read: Aadujeevitham: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘ఆడు జీవితం’.. 25 రోజుల్లోనే..!
విజయ్‌తో పాటు ఆయన అనుచరులు, మద్దతుదారులు 200 మందికి పైగా ఒకేసారి పోలింగ్ బూత్‌కు వచ్చారు. ఓ వైపు అనుచరులు, మరోవైపు ఫాన్స్ హడావుడితో అక్కడ సాధారణ ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇదే విషయమై సెల్వం అనే వ్యక్తి.. చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్మాదు చేశాడు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి 200 మందితో పోలింగ్ కేంద్రంలోకి విజయ్ వెళ్లారని, క్యూలో నిలబడకుండా ఆయన నేరుగా వెళ్లి ఓటు వేశారని పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. కొన్ని నెలల క్రితం ‘తమిళ వెట్రి కళగం’ పేరుతో విజయ్ రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!