మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరామమన్నారు. మిర్చికి రూ.11,600 పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. మార్కెట్ రేటుకు, రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న గ్యాప్‌ను కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆదుకోవాలని చూస్తున్నాం అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర…
మిర్చి ధర కొత్త రికార్డు సృష్టించింది… వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ లో ఆల్ టైమ్ హై రికార్డులు నెలకొల్పింది… దేశీ మిర్చి ధర ఏకంగా రూ. 90 వేలు పలికింది… మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక రికార్డు కావడం విశేషం.. హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబత్ పల్లికి చెందిన అశోక్ అనే రైతు మార్కెట్‌కు మిర్చి తీసుకొచ్చారు.. రైతు తీసుకొచ్చిన మిర్చిని మాదవి ట్రేడర్స్ విక్రయించగా… క్వింటాల్‌కు రూ.90 వేలు వెచ్చించి కోనుగోలు చేసింది…
ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. రాష్ట్రంలో మిర్చి రైతులు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం నుండి కనీస స్పందన కరువైందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే పంటల బీమా కోసం ఒక్క రూపాయి కట్టండి అని చెప్పారు. చివరికి రాష్ట్రం చెల్లించాల్సిన బీమా సొమ్ము చెల్లించలేదు.మిర్చిపై రైతులు నాలుగు వేల రూపాయల కోట్ల పెట్టుబడి పెట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రధాని మోదీ ఇచ్చిన వాటి గురించి చెప్పడు. సివిల్ సప్లయ్స్ ఛైర్మన్…
గుంటూరు జిల్లాలో మంత్రులు కన్నబాబు, మేకతోటి సుచరిత పర్యటించారు. ప్రత్తిపాడు మండలం కొండెపాడులో నల్లతామర పురుగుతో దెబ్బతిన్న మిర్చి పొలాలను పరిశీలించారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, హోంమంత్రి సుచరిత. మిరప తోటలను పరిశీలించాం. ఏదో ఒక సమస్య రైతులను పీడిస్తోంది. గుంటూరు జిల్లాలోనే లక్షా ఆరు వేల హెక్టార్లలో మిర్చి సాగవుతుంది. తామర పురుగు ఇతర దేశాల నుండి వచ్చి మన మిరపపై దాడి చేసింది.దీనికి సంబంధించి మన శాస్త్రవేత్తలు నివేదిక ఇచ్చారన్నారు మంత్రి కన్నబాబు.…