మిర్చి ధర కొత్త రికార్డు సృష్టించింది… వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ లో ఆల్ టైమ్ హై రికార్డులు నెలకొల్పింది… దేశీ మిర్చి ధర ఏకంగా రూ. 90 వేలు పలికింది… మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక రికార్డు కావడం విశేషం.. హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబత్ పల్లికి చెందిన అశోక్ అనే రైతు మార్కెట్‌కు మిర్చి తీసుకొచ్చారు.. రైతు తీసుకొచ్చిన మిర్చిని మాదవి ట్రేడర్స్ విక్రయించగా… క్వింటాల్‌కు రూ.90 వేలు వెచ్చించి కోనుగోలు చేసింది…