CM Revanth: ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించండి..
- ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించండి..
- హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలి..
- జాతీయ రహదారుల పనులు వెంటనే ప్రారంభించండి..
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth: ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అలాగే, హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని జాతీయ రహాదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని రేవంత్ ఇవాళ (బుధవారం) భేటీ అయ్యారు. ఈసందర్భంగా రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణతో పాటు నూతన జాతీయ రహదారుల ప్రకటన, ఇప్పటికే జాతీయ రహదారులుగా ప్రకటించిన మార్గాల పనుల ప్రారంభం తదితర విషయాలను కేంద్ర మంత్రి దృష్టికి తెలంగాణ సీఎం తీసుకెళ్లారు.
Read Also: Deputy Speaker: డిప్యూటీ స్పీకర్ పదవిపై విపక్షాల ఆశలు.. లోక్‌సభలో ఆ పదవికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి?.
Also Read
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
ఇక, సంగారెడ్డి నుంచి నర్సాపూర్- తూప్రాన్- గజ్వేల్- జగదేవ్‌పూర్- భువనగిరి- చౌటుప్పల్ (158.645 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారు.. కానీ, దాని భూ సేకరణకు అయ్యే వ్యయంలో సగ భాగాన్ని తమ ప్రభుత్వమే భరిస్తోందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ భాగంలో తమ వంతు పనులు వేగవంతం చేశామన్నారు. చౌటుప్పల్ నుంచి అమన్‌గల్- షాద్‌నగర్- సంగారెడ్డి వరకు (181.87 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని ఆయన కోరారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి.. ఈ ఏడాది ఎన్హెచ్ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలని తెలిపారు. హైదరాబాద్ (ఓఆర్ఆర్ గౌరెల్లి జంక్షన్) నుంచి వలిగొండ- తొర్రూర్- నెల్లికుదురు- మహబూబాబాద్-ఇల్లెందు- కొత్తగూడెం వరకు రహదారిని (ఎన్‌హెచ్-930పీ) జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్రమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
Read Also: Minister Damodar Raja Narasimha: జూడాలకు అండగా ఉంటాం.. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం..!
ఇక, హైదరాబాద్ వాసులు భద్రాచలం వెళ్లేందుకు 40 కిలో మీటర్ల దూరం తగ్గించే ఈ రహదారిని జైశ్రీరామ్ రోడ్‌గా వరంగల్ సభలో నితిన్ గడ్కరీ చెప్పిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ రహదారిలో మిగిలిన మూడు ప్యాకేజీలకు (165 కి.మీ) టెండర్లు పిలిచినందున వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎంపీ ఎంపీ వంశీ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు.
తాజావార్తలు
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?