CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ వారసత్వ సంపద పరిరక్షణ, మూసీ నది పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సిఎం సలహాదారు రామకృష్ణారావు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అగా ఖాన్ ఫౌండేషన్‌పై తమకు అత్యంత గౌరవం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్బంగా తెలిపారు. తెలంగాణ వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగా ఖాన్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఫౌండేషన్ సహకారంతో ఇటీవలే శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించుకున్నామని, కుతుబ్ షాహీ టూంబ్స్‌ను కూడా అగా ఖాన్ ఫౌండేషన్ పునరుద్ధరించిందని పేర్కొన్నారు.
Also Read
- Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
మూసీ నది పునరుజ్జీవం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సీఎం తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలోని సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో అగా ఖాన్ ఫౌండేషన్ సహకారం కోరుతున్నట్లు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. మూసీ నదిని నైట్ ఎకానమీకి అనుగుణంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
అలాగే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు తప్పక హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సమ్మిట్‌కు 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చెప్పారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, దీనిని నెట్-జీరో సిటీగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ఎయిర్‌పోర్టుకు కేవలం 20 నిమిషాల దూరంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు.
ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్‌కు చెందిన సంస్థ రూపొందిస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందులో 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని సీఎం పేర్కొన్నారు.
CM Revanth Reddy held a courtesy meeting with Prince Rahim Aga Khan V at the Taj Falaknuma Palace.
తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-V తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
సమావేశంలో పాల్గొన్న మంత్రి అజారుద్దీన్,ప్రభుత్వ ప్రధాన… pic.twitter.com/KRw5CHn2XJ
— Congress for Telangana (@Congress4TS) September 15, 2026
తాజావార్తలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?