418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రశాంత్ నీల్ సమర్పణలో, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మోస్ట్ అవేటెడ్ హారర్ చిత్రం ‘418’.వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, మేకర్స్ అనూహ్యంగా రిలీజ్‌ను వాయిదా వేశారు. అయితే ఈ వాయిదా వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! సినిమా కంటెంట్ చూసి బాలీవుడ్ ఎగ్జిబిటర్లు సైతం ఫిదా అవ్వడం, ఈ సినిమాను హిందీలో కూడా భారీగా విడుదల చేయాలని డిమాండ్ చేయడమే ఈ మార్పుకు ప్రధాన కారణం. తాజాగా విడుదలైన అధికారిక ప్రకటన ద్వారా మేకర్స్ ఈ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సాధారణంగా ఏదైనా సినిమా వాయిదా పడితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడమో, లేదా సరైన థియేటర్లు దొరక్కపోవడమో కారణం అనుకుంటారు. కానీ ‘418’ విషయంలో జరిగింది వేరు.
ఈ సినిమాకు సంబంధించి కొంతమంది ఇండస్ట్రీ వర్గాలకు, ఎంపిక చేసిన ప్రేక్షకులకు ఇటీవల ఎక్స్‌క్లూజివ్ స్క్రీనింగ్స్ వేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ హారర్ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇతర మార్కెట్లకు చెందిన ఎగ్జిబిటర్లు, మరీ ముఖ్యంగా హిందీ ఎగ్జిబిటర్లు ఈ సినిమాను చూసి థ్రిల్ అయ్యారు. దీన్ని కేవలం సౌత్ కే పరిమితం చేయకుండా, హిందీలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ పై తీవ్ర ఆసక్తి కనబరిచారు. ఇప్పటికే ట్రైలర్‌కు వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్, దానికి తోడు ఎగ్జిబిటర్ల నుంచి వస్తున్న అనూహ్యమైన డిమాండ్ చూసి మేకర్స్ టీమ్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
Also Read
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- Mandadi : 'మండాడి'కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
- Varanasi Movie: 'వారణాసి'లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
ఈ చిత్రాన్ని కేవలం పరిమితంగా కాకుండా, దేశవ్యాప్తంగా ఒకేసారి ‘గ్రాండ్ మల్టీ-లాంగ్వేజ్ రిలీజ్’ చేయాలని ఫిక్స్ అయ్యారు. దక్షిణాది భాషలతో పాటే, హిందీ ప్రేక్షకులను సైతం భయపెట్టేందుకు ఏకంగా పాన్-ఇండియా స్థాయిలో ఈ హారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ప్రమోషన్స్, ఎగ్జిబిషన్ ప్లాన్ చేయాల్సి రావడం వల్లే సెప్టెంబర్ 18 నాటి రిలీజ్‌ను రద్దు చేసి కాస్త సమయం తీసుకుంటున్నారు. “నిరీక్షణ కాస్త పెరిగినా, ‘418’ మాత్రం మరింత భారీగా ముస్తాబవుతోంది” అని చిత్రబృందం స్పష్టం చేసింది. అతి త్వరలోనే ఈ పాన్-ఇండియా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఏదేమైనా.. ఒక హారర్ సినిమా కంటెంట్‌తో నేరుగా బాలీవుడ్ వాళ్లను అట్రాక్ట్ చేసి పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లడం ఇప్పుడు నిజంగా సెన్సేషనే!
తాజావార్తలు
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?