రాష్ట్రంలో జరుగుతున్న ఆన్ లైన్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎక్కడ చుసిన ఆన్ లైన్ నేరగాళ్లు పెరుగుతున్నారు. సోషల్ మీడియా ను అదునుగా చేసుకొని ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు నేరగాళ్లు. ఎక్కువగా యువతను టార్గెట్ గా చేసుకొని , అందినంత లాగుతున్నారు ఈ సైబర్ నేరగాళ్లు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీస్కుంటున్నప్పటికీ , నగరంలో సెల్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ అవడం వల్ల సైబర్ నేరాలను అదుపు చేయడం పెద్ద ఛాలెంజ్ లాగా మారింది. చిన్న వయస్సు…
ప్రధాని పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు నిలిపేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేటకు రాకుండా పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారంటూ మండి పడ్డారు. సీఎం డైరెక్షన్ లోనే సభకు రాకుండా పోలీసులు కుట్ర చేశారని ఆరోపించారు. అయినా టీఆర్ఎస్ కుట్రలను చేధించుకుని బేగంపేట సభకు బీజేపీ కార్యకర్తలు వచ్చారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ‘వినాశకాలే విపరీత బుద్ధి’గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బేగంపేట ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉన్న…
హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంటే అందరికీ టీడీపీ అధినేత చంద్రబాబే గుర్తొస్తారు. ముంబై లేదా బెంగళూరులో ఏర్పాటు అవుతుందనుకున్న ఐఎస్‌బీని చంద్రబాబు హైదరాబాద్ తీసుకువచ్చారు. 2001లో టీడీపీ హయాంలోనే ఐఎస్‌బీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు కూడా ఐఎస్‌బీ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వరుసగా 17…
ఐఎస్పీ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రయాణంలో ఐఎస్‌బీ కీలక మైలురాయికి చేరుకుందని, . 2001లో నాటి ప్రధాని వాజ్‌పేయ్ దీనిని ప్రారంభించారని, ఎంతోమంది కృషి వల్లే ఆసియాలోనే టాప్ బిజినెస్ స్కూల్‌గా అవతరించిందన్నారు. ఐఎస్‌బీ విద్యార్థులు ఎన్నో స్టార్టప్‌లు ప్రారంభించారని పేర్కొన్నారు. G20 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మన భారతే అన్న ప్రధాని.. ప్రపంచంలో బలమైన స్టార్టప్ ఇకో సిస్టమ్ ఉన్న దేశాల్లో…
ప్రధాని మోడీ హైదరాబాద్‌లో నేడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌సీయూకు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా బీజేపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అయితే బేగంపేట ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో… పట్టుదలకు, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజల పేరుందని, తెలంగాణ…
జాతీయ రాజకీయాల్లో మరోసారి ప్రధానమంత్రి మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి హాట్ హాట్ గా చర్చ మొదలైంది. ప్రధాని రాక సమయంలోనే, కేసీఆర్ మరో స్టేట్ లో వుండటంపై పొలిటికల్ కాక రేగుతోంది. మే 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మోడీ పర్యటన సందర్భంగా హడావిడి చేసేందుకు తెలంగాణ బీజేపీ రెడీ అవుతోంది. మరోవైపు మోడీ హైదరాబాద్…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 26న రాష్ట్రానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని రాక అత్యంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు 20 రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలంతా రాష్ర్టానికి వస్తుండటం మరింత…