Narayana: అగ్నిపథ్ స్కీమ్.. కిషన్‌రెడ్డికి నారాయణ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్నిపథ్ స్కీమ్ అగ్గి రాజేసింది.. దేశ్యాప్తంగా ఆ పథకాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు యువత.. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. విధ్వంసం కూడా జరిగింది.. ఇక, ఆ ఆందోళనలు, విధ్వంసం వెనుక ఉన్నవారి వివరాలను రాబట్టేపలో పడిపోయారు పోలీసులు.. అయితే, అగ్నిపథ్ విషయంలో మాత్రం కేంద్రం వెనక్కి తగ్గడం లేదు.. ఇదే సమయంలో.. కొందరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. ఇక, అగ్నిపథ్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. సంగారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. యువకులను గాలికి వదలం కటింగ్ షాపులు, ఇస్త్రీ షాపులు, చెప్పుల షాపులు పెట్టుకోవచ్చని కేంద్రమంత్రి అంటున్నారు.. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేయోచ్చని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు..
Read Also: Viral: ఘనంగా శునకం బర్త్ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్ టచ్ కూడా ఉందట..!
Also Read
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్‌నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- OTR : కొందరు 'దరిద్రుల' వల్లే పార్టీ మారా!: పోచారం
ఇక, సికింద్రాబాద్‌లో ఫైరింగ్ విషయంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ.. పోలీసు ఆఫీసర్లు దద్దమ్మలు అని వ్యాఖ్యానించిన ఆయన.. బులెట్ మిస్‌ఫైర్ ఆయ్యిందని అంటున్నారు.. పోలీసులు వెళ్లి గాడిదలు మేపుకొండి అంటూ ఫైర్ అయ్యారు. అగ్నిపథ్ పోరాటంలో రాకేష్ పై జరిగిన కాల్పుల విషయంలో పోలీసుల మాట్లాడిన తీరు సరికాదన్నారు. మరోవైపు.. సీఎం కేసీఆర్ కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి అంటాడు తప్ప ఏ దానికి సిద్ధంగా ఉండడు అని సెటైర్లు వేశారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా మరో అభ్యర్థిని పెట్టేందుకు కేసీఆర్, వైఎస్ జగన్ ముందుకు రావాలని సూచించారు.. ఇక, తెలంగాణలో భూముల రేట్లు కోట్లు పలుకుతున్నాయని సీఎం కేసీఆర్ అంటే.. జహీరాబాద్ వచ్చిన కేటీఆర్ నిమ్జ్ రైతులకు ఐదు లక్షలు పరిహారం ఇస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.. న్యాయం కోసం నిమ్జ్ రైతులు ఎదురు చూస్తుంటే వారిపై లాఠీఛార్జి చేయిస్తారా? అని మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ.
- Tags
- Agnipati Scheme
- bjp
- cm kcr
- cpi
- narayana
తాజావార్తలు
-
Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
-
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
-
Vishal: నేను బ్యాక్బెంచర్నే.. మా బ్యాచ్‌లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ మంత్రి..
-
Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!