తెలంగాణలో రోజు రోజుకు కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఈ రోజు కొత్తగా 1920 కరోనా కేసులు నమోదైనట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా మొత్తం కరోనా కేసులు 6,97,775 గా ఉన్నాయి. కరోనాతో రికవరీ అయిన వారి సంఖ్య 417గా ఉంది. మరో వైపు కోరోనాతో ఈ రోజు ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,045 గా ఉంది.
Read Also: ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 1,831 కేసులు
అయితే రికవరీ రేటు 97.05 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు కరోనాతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య16,496గా ఉంది. ఈ రోజు 83,153 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 1920 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యాధికారులు వెల్లడించారు. ఇంకా 15,969 మంది పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉందని వైద్యాధికారులు పేర్కొన్నారు. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.