V.Hanumantha Rao: ఉద్యోగాలు ఓకే.. నిరుద్యోగ భృతి ఎక్కడ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కొత్తగా 80వేల ఉద్యోగాల భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఈ అంశంపై స్పందించారు. నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే సీఎం కేసీఆర్ ఈరోజు ఈ ఉద్యోగ ప్రకటన చేశారని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగాల ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని.. కానీ గతంలో హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
తెలంగాణ రాష్ట్రం ఒక్క కేసీఆర్ వల్లే రాలేదని.. అందరి త్యాగాల ఫలమే తెలంగాణ రాష్ట్రం అని వీహెచ్ అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 3 వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు కాబట్టే ఈరోజు ఉద్యోగాల ప్రకటన చేశారని వీహెచ్ ఆరోపించారు. ST, SC, BCల గురించి కాంగ్రెస్ ఎన్నో ఏళ్ల నుండి పోరాడితేనే ఇప్పుడు ప్రభుత్వం 49 సంవత్సరాల వయో పరిమితిని పెంచిందన్నారు. తక్షణమే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించాలని.. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి కింద రూ.3వేలు ఇవ్వాలని కోరారు. ఉద్యోగాల కోసం చనిపోయిన కుటుంబాలను కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆదుకోవాలని హితవు పలికారు.
Also Read
- Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
- CM Revanth: విద్యార్థులపై దాడులు అమానుషం.. నీట్ వ్యవహారంపై కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్..!
- Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
తాజావార్తలు
-
NEET Abolition: నీట్‌పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
-
Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
VW 24 inch QLED TV: VW 24 ఇంచెస్ HD Ready QLED TV.. రూ.5 వేలలోనే బెస్ట్ బడ్జెట్ టీవీ!
-
Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్‌పై పవన్ కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!