Israel PM: మోతాదుకు మించి ఇరాన్ యురేనియంను శుద్ధి చేయడమే ఇజ్రాయెల్, అమెరికా కోపానికి గురి కావడంతోనే.. యుద్ధానికి దారి తీసింది. ఇంత భారీ స్థాయిలో దాడి చేసినా.. ఆ శుద్ధి చేసిన యురేనియం యొక్క జాడ మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అణుబాంబు తయారీకి అవసరమైన 60-90శాతం మధ్యలో దానిని శుద్ధి చేసి స్వచ్ఛమైన యురేనియం 235ను ఇరాన్ తయారు చేస్తోందని అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాల ఆరోపించాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లలో 60 శాతం శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం ఉందని తేలింది. దీనిని కూడా కొన్ని రకాల ఆయుధాల్లో వాడే ఛాన్స్ ఉంది. దాన్ని చిన్న కంటైనర్లు, కార్లలో కూడా పెట్టి తరలించే అవకాశం ఉందని నిపుణులు తెలియజేశారు.
Read Also: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!
ఇక, యూఎస్ దాడులు చేసే నాటికే దేశంలోని శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని ఓ రహస్య ప్రదేశానికి తరలించినట్లు ఇరాన్ పేర్కొంది. వీటిల్లో కొంత ఫోర్డో అణు కేంద్రం నుంచే తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, జూన్ 19వ తేదీన 16 ట్రక్కుల కదలికలను అమెరికాకు చెందిన మ్యాక్సర్ టెక్నాలజీస్ గుర్తించింది. ఇస్ఫహాన్ పరిశోధన కేంద్రంలో కూడా ఇరాన్ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో 60 శాతం ఇక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా జరిగిన దాడిలో కూడా నతాంజ్, ఫోర్డోపై అమెరికా బంకర్ బస్టర్లతో దాడి చేసింది. కానీ, ఇస్ఫహాన్‌పై మాత్రం తోమహాక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో కేవలం భవనాలకే పరిమితం అయ్యాయి. అయితే, అమెరికా దాడులు చేసిన ప్రదేశాల నుంచి రేడియేషన్ వెలువడలేదు. అసలు అక్కడ అణు ధార్మిక పదార్థాలు ఉన్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇరాన్ యురేనియం నిల్వలు ఎక్కడ ఉన్నాయో తమకు తెలియదన్నారు. వాటిని కనుక్కునే దిశగా అమెరికా ప్రణాళిక రచిస్తుందన్నారు.
Read Also: Nabha Natesh : అందం గేట్లు తెరిచేసిన నభా నటేష్..
అయితే, టెహ్నాన్ 60 శాతం శుద్ధి చేసిన 400 కిలో గ్రాముల యురేనియం గురించి ఆసక్తికరమైన ఇంటెలిజెన్స్ రిపోర్టు తమకు అందిందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. కానీ, ఆ వివరాలు బయటకు చెప్పడం కుదరదు అన్నారు. తాము హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లాను చంపేసిన తర్వాత ఇరాన్ అణ్వాయుధాల తయారీ మొదలు పెట్టిందని వెల్లడించారు. దీంతో పాటు ఇరాన్ నెలకు 300 బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను అమెరికా అధ్యక్షుడి దృష్టికి తీసుకొచ్చి త్వరగా చర్యలు తీసుకోవాలని కోరాను.. డొనాల్డ్ ట్రంప్ కూడా అర్థం చేసుకొని యూఎస్ కి మంచి జరిగే నిర్ణయమే తీసుకున్నారని నెతన్యాహు తెలిపారు.