Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Congress Prez Poll Ponnala Lakshmaiah Fire Gandhi Bhavan Staff

AICC President Election: గాంధీ భవన్‌ ఓటింగ్‌ సిబ్బందిపై పొన్నాల ఫైర్‌..

Published Date :October 17, 2022 , 11:33 am
By NTV WebDesk
AICC President Election: గాంధీ భవన్‌ ఓటింగ్‌ సిబ్బందిపై పొన్నాల ఫైర్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

AICC President Election: గాంధీ భవన్‌ ఓటింగ్‌ సిబ్బందిపై టీపిసిసి అధ్యక్షులు పొన్నాల ఫైర్‌ అయ్యారు. ఓటు వేయడానికి వచ్చిన శ్రీనివాసరెడ్డిని ఎన్నికల సిబ్బంది నిరాకరించింది. శ్రీనివాసరెడ్డి స్థానంలో కొమ్మూరి ప్రతాప్‌ కు ఓటు ఇవ్వడంపై రగడ మొదలైంది. శ్రీనివాస్‌ రెడ్డికి బదులు కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డికి ఓటు ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఇద్దరికి మాత్రమే ఓటింగ్‌ కు అవకాశం ముందని ఓటింగ్‌ సిబ్బందిపై ఫైర్‌ అయ్యారు. జనగామ నుంచి పొన్నాలతో పాటు శ్రీనివాసరెడ్డికి ఏఐసీసీ ఐడీకార్డు ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నాల. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక వేళ గాందీభవన్‌ వద్ద పొన్నాల గరంగరం అయ్యారు. 45ఏళ్ల కాంగ్రెస్‌ మనిషికి అవమానమని పొన్నాల మండిపడ్డారు. దీంతో.. పొన్నాలను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి సముదాయించారు.

ఇక జానారెడ్డి మాట్లాడుతూ.. వివాదం ఏంటిదో నాకు తెలియదు. నువ్వు తెలుసుకొని వచ్చి నాకు అడిగితే అప్పుడు చెబుతానంటూ మీడియా ప్రతినిధులపై సీరియస్‌ మాట్లాడారు జానారెడ్డి. మళ్లీ కూల్‌ గా దేశప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చాలా కాలంతర్వాత ఏఐసీసీకి డెమక్రటిక్‌ గా ఎన్నికలు జరగడం ఎలక్షన్స్‌ లో దేశంలోని కాంగ్రెస్‌ వర్గాలు మొత్తం పాల్గొనడం కాంగ్రెస్‌ పార్టీకి ఒక మలుపుకు సాంకేతం అన్నారు. ప్రశాంతంగా ఓటింగ్‌ జరగాలని కోరారు. వాదాలు, వివాదాల గురించి, ఇతర సమస్యల గురించి మాట్లాడటం తనకు సమంజసం కాదని తెలిపారు. పొన్నాల కోపడ్డారు ఏంటని మీడియా అడగ్గా ఏంజరిగిందో నాకు తెలియదు.. ఆయన్నే అడిగి తెలుసుకోండంటూ మాటమార్చారు జనారెడ్డి.

ఏఐసీసీ కార్యదర్శి సంపత్ మాట్లాడుతూ.. పీసీసీ సభ్యుల నీయామకం పై మాకు కూడా అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్కో నియోజక వర్గం నుండి ఇద్దరే ఉండాలి సరే.. కానీ, తేడా ఎక్కడ జరిగింది అనే దానిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అధికారిని కూడా ఇదే డిమాండ్ చేస్తున్నా అని సంపత్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ బూత్​లలో ఎన్నికలు జరుగుతున్నాయి. 137 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో ఎన్నికల జరగడం ఇది ఆరోసారి. 9 వేల మందికిపైగా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో పార్టీ సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌ ఉన్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. ఎల్లుండి ఓట్లు లెక్కింపు జరగనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో పోలింగ్ జరుగుతోంది. భారత్ జోడో యాత్ర క్యాంప్‌లో కూడా పోలింగ్​కు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ సహా 75 మంది పార్టీ ప్రతినిధులు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటకలోని బళ్లారిలో ఓటు వేయనున్నారు.
Congress President Election : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్.. ఓటేసిన సోనియా, ప్రియాంక

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress Party
  • Gandhi Bhavan
  • ponnala lakshmaiah
  • President Elections

తాజావార్తలు

  • SRHకి డ్రీమ్ స్టార్ట్.. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్‌తో ఔట్! Kavya Maran ఫీలింగ్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్

  • Rajya Sabha: 17న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక.. రేసులో ఎవరున్నారంటే..!

  • Nashik: లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి.. ఏకంగా TCS ఆఫీసులోనే దుకాణం పెట్టేసిన కంత్రీగాళ్లు.!

  • Bengal Election: వేదికపై సీఎం యోగి కాళ్లకు నమస్కరించిన సువేందు అధికారి.. వీడియో వైరల్

  • SRH vs RR: దంచి కొట్టిన ఇషాన్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions