CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) సమావేశం నేడు జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం నీటిపారుదల శాఖలో ప్రాజెక్టులు, అక్రమాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.
Read also: Purandeswari: అమిత్ షా పొత్తు కామెంట్.. పురంధేశ్వరి ఏమన్నారంటే..
ఈ సీఎల్పీ సమావేశంలో నీటిపారుదల శాఖలో గత ప్రభుత్వం చేసిన అవినీతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సోమవారం (ఫిబ్రవరి 12) జరగనున్న అసెంబ్లీలో ఏ అంశంపై ఎవరు ఏం మాట్లాడాలనే దానిపై సీఎల్సీ ఈరోజు దిశానిర్దేశం చేయనుంది. ఎల్లుండి (మంగళవారం) మేడిగడ్డలో క్షేత్రస్థాయిలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సాగునీటి విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.
Chiyaan Vikram: ఆ సినిమాకి సీక్వెల్ చేస్తే థియేటర్స్ తగలబడిపోతాయ్…