చియాన్ విక్రమ్ నుంచి అభిమానులకి సూపర్ ట్వీట్ వచ్చింది. రెండు ఫోటోలు పోస్ట్ చేసిన విక్రమ్, ఫ్యాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చాడు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఉన్న ఫోటోలని పోస్ట్ చేసిన విక్రమ్… మహాన్ 2 అంటూ ట్వీట్ చేసాడు. మహాన్ 2 చేస్తున్నాను, అనౌన్స్మెంట్ వస్తుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే… లాంటి విషయాలని ఏమీ చెప్పకుండా కేవలం మహాన్ 2 అని మాత్రమే ట్వీట్ చేసాడు విక్రమ్. దీంతో సోషల్ మీడియా ఒక్కసారి మహాన్ సీన్స్ తో మోతమోగిపోతుంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన మహాన్ సినిమా కరోనా కారణంగా డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసింది. చియాన్ విక్రమ్ అతని కొడుకు ధృవ్ కలిసి నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకి ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య కాలంలో విక్రమ్ నటించిన అన్ని సినిమాలకన్నా మహాన్ సినిమాకి ఎక్కువ పేరొచ్చింది.
థియేటర్స్ లోకి వచ్చి ఉంటే మహాన్ సినిమా విక్రమ్ కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచేది. పోలీస్ గా ధృవ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. విక్రమ్ అండ్ ధృవ్ కి మధ్య కార్తీక్ సుబ్బరాజ్ డిజైన్ చేసిన సీన్స్ ని ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఇద్దరి ఫేస్ ఆఫ్ వార్ సినిమాకే హైలైట్ అయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ధృవ్-విక్రమ్ మధ్య సీన్ కోలీవుడ్ ఆడియన్స్ ని విపరీతంగా ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది అంటే పార్ట్ 2లో విక్రమ్ vs ధృవ్ వార్ ఉండడం గ్యారెంటీ. ఈ వార్ ని కార్తీక్ సుబ్బరాజ్ కరెక్ట్ గా ప్లాన్ చేస్తే చాలు విక్రమ్ కి తెలుగులో కూడా మంచి హిట్ పడినట్లే. అయితే నిజంగానే మహాన్ 2 రాబోతోందా లేక విక్రమ్ ఫోటోస్ మహాన్ లుక్ లో ఉన్నాయి కాబట్టి మహాన్ 2 అని ట్వీట్ చేశాడా అనేది తెలియాల్సి ఉంది.
Mahaan2!!? 😉 pic.twitter.com/HTB3uyMtMm
— Vikram (@chiyaan) February 11, 2024