GHMC Meeting: మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జీహెచ్ఎంసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సభ ప్రారంభానికి ముందు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఎస్ఆర్డిపి రెండో విడత పనులు ఏమయ్యాయంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలంటూ జీహెచ్ఎంసీ నినాదాలు చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికుల ఆందోళనకు నిరసనగా బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. బీజేపీ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని బీజేపీ కార్పొరేటర్లు కోరారు. తీర్మానం చేయాలని కోరారు.
Read also: Bigg Boss Telugu Season 7 : సడెన్ గా బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ క్రేజీ హీరోయిన్…?
సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. బీజేపీ కార్పొరేటర్ల తీరుపై మేయర్ విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్లకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో సమాధానం చెప్పినా అర్థం కావడం లేదన్నారు. ఇక నుంచి కమిషనర్ ను తమిళంలో సమాధానం చెప్పాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి సెటైర్లు వేశారు. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు పోటాపోటీగా ప్రచారంలో మాట్లాడారు. ఈ సమయంలో ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మార్షల్స్‌ను పిలవాల్సి ఉంటుందని మేయర్ వ్యాఖ్యానించారు. కాగా, జీహెచ్ఎంసీ సమావేశానికి జర్నలిస్టులకు మేయర్ అనుమతి నిరాకరించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జర్నలిస్టులను సదస్సుకు అనుమతించారు. అయితే నేటి సమావేశానికి జర్నలిస్టులను అనుమతించలేదు. కాన్ఫరెన్స్ హాలులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.