CM Revanth Review: సీఎం రేవంత్ విద్యుత్ అధికారులతో సమీక్ష.. సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Review: సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి విద్యుత్ పై సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖ సమీక్షలో విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, సింగరేణి సిఎండి శ్రీధర్, విద్యుత్ శాఖ జేఎండి శ్రీనివాసరావు, ఎస్పీడిసియేఎల్ సిఎండి రఘుమారెడ్డి, ఎన్పిడీసీఎల్ సిఎండి గోపాల్ రావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉన్నతాధికారులు ఇస్తున్నారు. 2014 జూన్ 2 కంటే ముందు పరిస్థితులు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు స్పష్టంగా ఇవ్వాలని తెలిపారు. మరోవైపు సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోనే వున్న ప్రభాకర్ రావు ఈరోజు రివ్యూకు హాజరు కాలేదు. దీంతో సీఎం ఈరోజు సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో తెలుపాలని అన్నారు. నిన్నటి నుంచి విద్యుత్ శాఖ అంశం పై సీఎం సీరియస్ గా వున్నారు. 85 వేల కోట్ల నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఇటీవల రాజీనామా చేశారని తెలిపారు. అయితే దీంతో సీఎం రేవంత్ రెడ్డి సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదం తెలపవద్దని సమీక్షకు ఆయన్ను కూడా పిలవాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.
Read also: Most Expensive Cake : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కేక్.. ధర వింటే మైండ్ బ్లాకే..!
Also Read
- WhatsApp Scam Alert: వాట్సాప్లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
- Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
- Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
- Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
అయినా కూడా ప్రభాకర్ రావు సమీక్షకు హాజరు కాలేదు. ప్రభాకర్ రావు ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. అయినా సమీక్షకు గైర్హాజరు కావడంతో సీఎం ఏవిధంగా స్పందించనున్నారు అనేదానిపై స్పష్టత రానుంది. మరోవైపు ఆర్టీసీ శాఖలపై సీఎం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ కమిషనర్ వాణి ప్రసాద్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఆర్టీసీ ఈడీలు, ఉన్నతధికారులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం సెక్రటేరియట్ కు సీఎం రేవంత్, పలువురు మంత్రులు సహా ఉన్నతాధికారులు చేరుకున్నారు. ఆర్టీసీ తరువాత విద్యుత్ శాఖపై రివ్యూ నిర్వహించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ అంశంపై ఆర్టిసి ఎండి సజ్జనార్ తో చర్చించారు సీఎం. ఇప్పటికే కర్ణాటక వెళ్లి ఉచిత ప్రయాణంపై ఆర్టిసి అధికారుల అధ్యయనం చేశారు.
Mizoram New CM: మిజోరం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన లాల్‌దుహోమా
తాజావార్తలు
-
Jailer 2: టాలీవుడ్ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!