జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. ప్రతి అధికారి పూర్తి స్థాయిలో తమ విధులను నిర్వహించాలని, చేయలేని వారు తమ బాధ్యతల నుంచి తప్పుకోవచ్చని పేర్కొన్నారు. రోజుకు 18 గంటలు పని చేయాలని, పని చేయడం ఇష్టం లేని వాళ్ళు cs.. డీజీపీ కి చెప్పి తప్పుకోవచ్చన్నారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభల పై సమీక్షలు ఉంటాయన్నారు.