CM Revanth Reddy: తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. మిషన్ 15 సాధనకు రీచ్ అయ్యేలా టీ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈనెల 19వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 50 సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ చేవెళ్ల లోక్‌సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు గాంధీభవన్ లో బీజేపీపై ఛార్జ్ షీట్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు రాజేంద్ర నగర్‌లో రోడ్ షో లో ప్రసంగించానున్నారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రోడ్ షోలో సీఎం రేవంత్ పాల్గొంటారు. చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా ర్యాలీతో పాటు సభలోనూ సీఎం రేవంత్ పాల్గొననున్నారు.
Read also: Ramasahayam Raghuram Reddy : ఖమ్మం ఎంపీ అభ్యర్ధిగా విక్టరీ వెంకటేష్ వియ్యంకుడు..
నిన్న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్‌లో నిర్వహించే సభల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేతలకు మత పిచ్చి పట్టుకుందని.. భూములు ఆక్రమించుకునే ఆరూరి రమేష్ కావాలో.. పేదలకు వైద్యం అందించే కడియం కావ్య కావాలో తేల్చుకోండని ఓటర్లకు సూచించారు. కడియం శ్రీహరి నిజాయితీ చూసి పార్టీలో చేర్చుకున్నామన్నారు. ఈ ప్రాంతం నుంచి మరొక ఆడబిడ్డ కావ్యను ఆశీర్వదించండని కోరారు. ఆరూరి రమేష్ కు ఓటు వేస్తే.. అనకొండగా మారి మీ భూములను మింగేస్తాడని విమర్శించారు. నిజాయితీని వారసత్వంగా తీసుకున్న.. మీ కోసం కొట్లాడే కావ్యను గెలిపించండి.. వరంగల్ ను అభివృద్ధి చేసే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. అనంతరం బీఆర్ఎస్, బీజేపీపై ఫైర్ అయ్యారు. సెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నాలుగు గంటలు టీవీ స్టుడియోలో ఎలా కూర్చున్నాడని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Read also: World Malaria Day: నేటి నుంచి దేశంలో మలేరియా నిర్మూలన ప్రాజెక్ట్ చివరి దశ షురూ
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మందేసి గీశాడో.. దిగాక గేసాడోగానీ కూలిపోయిందని విమర్శించారు. నువ్వు కట్టిన కాళేశ్వరం అద్భుతమైతే దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రమ్మని.. కేసీఆర్ కు సవాల్ విసిరారు. హరీష్ రావు.. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని రెడీగా ఉండమన్నారు. రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్నా.. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసి ఆత్మహత్యలు ఆపుతానని మోడీ హామీ ఇచ్చారని.. కానీ ఆత్మహత్యలు ఆగలేదన్నారు. రైతుల ఆదాయం పెరగలేదని.. జన్ ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానన్న మోడీ మోసం చేశారన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకుండా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని తెలిపారు. కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తరలించుకుపోయారన్నారు.
Fahad Faasil : ఓటీటీలపై ఫహాద్ ఫాజిల్ సంచలన వ్యాఖ్యలు..