CM Revanth Reddy: నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. మద్దూరు మండలం తిమ్మాజీపల్లి గ్రామంలో జరిగే బావోజీ జాతరకు సీఎం హాజరుకానున్నారు. ఇవాల్టి నుంచి ఈనెల 25వ తేదీ వరకు నిర్వహించనున్న గురులోకా మాసంద్ ప్రభు జాతర నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం 5:30 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అభ్యర్థి మల్లు రవి నేతృత్వంలో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించనున్నారు.
Read also: Arvind Kejriwal: పెరిగిన షుగర్ లెవెల్స్.. కేజ్రీవాల్‌కు తీహార్ జైలులో ఇన్సులిన్!
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో బహిరంగ సభ, నారాయణపేట జిల్లా మద్దూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో, కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో జరిగే బావోజీ బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నాగర్‌కర్నూల్ జిల్లాకు వస్తున్న రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు ఐదుగురు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తరలిరానున్నారు. తిమ్మారెడ్డిపల్లిలో జరుగుతున్న బావోజీ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి సందర్శించనున్న సందర్భంగా 500 మంది సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మహబూబ్ నగర్, వికారా బాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చిన సిబ్బందితో ఎస్పీ యోగేష్ గౌతమ్ సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. 10 సెక్టార్లుగా విభజించి రూట్ మ్యాప్ ఆధారంగా మద్దూరు నుంచి తిమ్మారెడ్డిపల్లి జాతర వరకు బందో బస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేటాయించిన స్థలాల్లోనే సిబ్బంది విధులు నిర్వహించాలని ఆదేశించారు.
Kondagattu: ఆర్జిత సేవలు లేవన్నారు.. ప్రత్యేక పూజలు, దర్శనాలు ఏంటని భక్తుల ఆగ్రహం