అనుపమ పరమేశ్వరన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె రవితేజ ఈగల్ సినిమాలో నటిస్తుంది.. ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, అవసరాల శ్రీనివాస్, నవదీప్, మధుబాల తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మూవీలోని కొంతమంది యాక్టర్స్ తో రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలాగా ప్లాన్ చేశారు..
అందులో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. డైరెక్టర్ కార్తీక్ అన్నయ్య అంది. దీంతో రవితేజ.. నువ్వు అతన్ని అన్నయ్య అని పిలిచావా.. అందమైన అమ్మాయిలు అన్నయ్య అనే వర్డ్ వాడకూడదు.. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో అని రవితేజ అన్నారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తాజాగా జరిగిన ఈగల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుపమని స్టేజిపైకి మాట్లాడటానికి పిలిచినప్పుడు ఆ వైరల్ వీడియోని స్టేజిపై ప్లే చేశారు. దీంతో అనుపమ.. సారీ రవిగారు. నాలుగు సినిమాలు చేశాను కార్తీక్ తో. ఆయనతో మంచి బాండ్ ఉంది. అలాగే అలవాటు అయిపోయింది. మార్చుకోలేను అని చెప్పింది. వెంటనే యాంకర్ సుమ పక్కనే ఉన్న వ్యక్తిని రాఖీని తీసుకొని రమ్మని చెప్పింది.. అనుపమకి ఇవ్వడంతో అనుపమ స్టేజిపైనే డైరెక్టర్ కార్తీక్ కి రాఖీ కట్టి హగ్ ఇచ్చింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..