CM Revanth Reddy : క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదిక కావాలి…
- క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు కృషి
- తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
- క్రీడా పోటీలు, సబ్ కమిటీల ఏర్పాటుపై తీర్మానాలు...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : ఖేలో ఇండియా, కామన్ వెల్త్, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు అవకాశం కల్పించాలని తెలంగాణ స్పోర్ట్స్ హబ్ తీర్మానం చేసింది. రాష్ట్రంలో స్టేడియాల నిర్వహణ, వసతులు మెరుగుపర్చడం, కోచ్‌లు, ట్రైనర్లకు శిక్షణ, క్రీడా పాలసీలో వివిధ అంశాలపై ప్రణాళిక రూపకల్పన, అమలుకు సబ్ కమిటీల ఏర్పాటుకు బోర్డు తీర్మానాలు చేసింది. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు మొదటి సమావేశం హైదరాబాద్‌లో గురువారం జరిగింది. సమావేశంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత రెడ్డి మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా విధానం, క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలనేదే తన లక్ష్యమన్నారు. క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదికగా మారాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలంగాణకు ఐటీ సంస్కృతి ఉందని… రాష్ట్రంలోని ప్రతి కుటుంబం తమ పిల్లలు ఐటీ రంగంలో ఉండాలని కోరుకుంటున్నారని… అలానే క్రీడా సంస్కృతి రావాలని తాను అభిలషిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడా రంగం ప్రోత్సాహానికిగానూ గతంతో పోల్చితే 16 రెట్లు బడ్జెట్ పెంచామని సీఎం వివరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రోత్సాహాకాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని సీఎం తెలిపారు. క్రీడా రంగం ప్రాధాన్యతను పెంచేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు.
Kim Jong Un’s Bulletproof Train: ఇది కదిలే కమాండ్ సెంటర్.. ఉత్తర కొరియా నియంత స్పెషల్ ట్రైన్
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్టేడియాలు, అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవని, వాటిని సమగ్రంగా సద్వినియోగం చేసుకోవడంతో పాటు క్రీడా రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు బోర్డు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం కోరారు. క్రీడా రంగం అభివృద్ధికి నిధులు, నిపుణులు, నిర్వహణ అవసరమైనందునే బోర్డులో ప్రముఖ కార్పొరేట్లు, క్రీడాకారులు, క్రీడా నిర్వాహకులకు చోటు కల్పించామని సీఎం తెలిపారు. ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మాట్లాడుతూ తొలుత క్రీడా సంస్కృతిని పెంపొందించాలని… ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో పాల్గొనేలా చూస్తే ఫలితాలు వాటంతటవే వస్తాయని అభిప్రాయపడ్డారు. హర్యానాలో కుస్తీతో ప్రతి క్రీడకు పల్లెల్లో చోటు ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు, వ్యాయామ సంచాలకుడు ఉండేలా చూడాలన్నారు. ధాని ఫౌండేషన్ వీతా ధానీ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని… వ్యాయామ అక్షరాస్యత (Physical literacy)పై అవగాహన పెంపొందించాల్సి ఉందన్నారు…బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి క్రీడా పోటీలు దశలవారీగా ఉండాలని.. అప్పుడు మెరుగైన క్రీడాకారుల ఎంపిక సాధ్యమవుతుందన్నారు…హబ్ కో ఛైర్పర్సన్ ఉపాసన కొణిదెల మాట్లాడుతూ ఫిజియోథెరపిస్టు కోర్సులను క్రీడా యూనివర్సిటీలో ప్రారంభించాలని కోరారు. అలాగే స్పోర్ట్స్ సామగ్రిపై పన్నుల భారం భారీగా ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. హబ్ ఛైర్పర్సన్ డాక్టర్ సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ ప్రపంచ ప్రముఖ కంపెనీల సీఈవోలు ఈ ప్రాంతం నుంచే ఉన్నందున వారి సేవలను క్రీడాభివృద్దికి వినియోగించుకోవాలన్నారు.
విశ్వ సముద్ర ఫౌండేషన్ చింతా శశిధర్ మాట్లాడుతూ క్రీడల్లో రాణించే వారికి అవసరమైన సామగ్రిని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు…క్రీడా నిర్వాహకులు బియ్యాల పాపారావు మాట్లాడుతూ ఐఐటీ ప్రొఫెసర్లు మాదిరి స్పోర్ట్స్ యూనివర్సిటీలో కోచ్‌లు ఉండాలన్నారు. ఫుట్ బాట్ టీమ్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా మాట్లాడుతూ గ్రామ స్థాయిలో స్టేడియాలు, క్రీడా సామగ్రి అందుబాటులో ఉండే క్రీడాకారులు వెలుగులోకి వస్తారని తెలిపారు. ఇంగ్లాండ్‌లో ప్రతి ఆటకు లీగ్స్ ఉంటాయని…అలాగే మన దగ్గర ప్రతి ఆటకు లీగ్స్ ఉండాలన్నారు. ప్రముఖ క్రీడాకారుడు రవికాంత్ రెడ్డి మాట్లాడుతూ మనకు ఉన్న స్టేడియాలను మెరుగ్గా వినియోగించుకోవాలని, వాటి నిర్వహణ సక్రమంగా చేయాలన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉన్న క్రీడా పోటీల విధానాన్ని మార్చుతూ గ్రామ, మండల, శాసనసభ నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. శాసనసభ నియోజకవర్గ స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్ల మధ్య పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించి అంతిమంగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి రాష్ట్ర స్థాయి జట్లను ఎంపిక చేస్తామన్నారు.. క్రీడా సామగ్రిపై ఉన్న పన్నుల తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని… తమ స్థాయిలో అవసరమైన ప్రోత్సాహాకాలు అందిస్తామని తెలిపారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ, ఇతర క్రీడా సంబంధిత కోర్సులు ప్రవేశపెడతామని బోర్డు సభ్యులకు తెలియజేశారు. స్టేడియాలు పెద్ద సంఖ్యలో ఉన్నా తగిన సంఖ్యలో కోచ్‌లు లేరని, ఉన్న కోచ్‌లకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగినట్లు శిక్షణ ఇప్పించాల్సి ఉందన్నారు. రానున్న మూడేళ్లలో మనం సాధించాల్సిన లక్ష్యాలపై బోర్డు తగిన కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. సమావేశంలో క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోని బాల దేవి తదితరులు పాల్గొన్నారు.
Pawan kalyan: ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ భేటీ.. మూడు తీర్మానాలకు ఆమోదం!
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!