ఖేలో ఇండియా, కామన్ వెల్త్, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు అవకాశం కల్పించాలని తెలంగాణ స్పోర్ట్స్ హబ్ తీర్మానం చేసింది. రాష్ట్రంలో స్టేడియాల నిర్వహణ, వసతులు మెరుగుపర్చడం, కోచ్‌లు, ట్రైనర్‌లకు శిక్షణ, క్రీడా పాలసీలో వివిధ అంశాలపై ప్రణాళిక రూపకల్పన, అమలుకు సబ్ కమిటీల ఏర్పాటుకు బోర్డు తీర్మానాలు చేసింది.
Union Budget 2024 For Sports: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో క్రీడా రంగానికి రూ.3,442.32 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే.. ఈసారి క్రీడలకు 45.36 కోట్లు అదనంగా కేటాయించారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేలో ఇండియా’కు అత్యధికంగా రూ.900 కోట్లు కేటాయించారు. ఖేలో ఇండియాకు గతంలో కంటే రూ.20 కోట్లు పెంచారు. కేంద్ర…
ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రేపటి నుంచి ఈ నెల 13 వరకు హర్యానాలోని పంచకులలో ప్రారంభం కానున్నాయి. 25 క్రీడావిభాగాల్లో మొత్తం 4,700 మంది అథ్లెట్లు పోటీ పడుతుండగా.. ఇందులో 2,262 మంది బాలికలు ఉన్నారు. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్, వాలీబాల్, బాక్సింగ్‌తో పాటు ఇతర క్రీడలను ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో నిర్వహించనున్నారు. అంబాల, షాహాబాద్, చండీగఢ్, న్యూఢిల్లీలోని మైదానాల్లో ఈ గేమ్స్ జరగనున్నాయి. COMMONWEALTH…