Pawan Kalyan Meets MLAs in Vizag: విశాఖలో జరుగుతున్న ‘సేనతో సేనాని’ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. పార్టీని బలోపేతం చేయడంలో ఎమ్మెల్యేల బాధ్యత కీలకమని పవన్ స్పష్టం చేశారు. కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదని ఎమ్మెల్యేలకు దిశానిదేశం చేశారు. పార్టీ కార్యకర్తలను, ఇతర నేతలను కలుపుకుని వెళ్లాలని ఎమ్మెల్యేలకు చెప్పారు. పార్టీ నిర్మాణం, కార్యకర్తల అభివృద్ధికి సంబంధించిన మూడు తీర్మానాలను జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఆమోదించారు.
ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే స్థాయి నేతలు అండగా ఉండాలని తీర్మానం చేశారు. ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారాలను దీటుగా ఎదుర్కోవాలన్న మరో తీర్మానం.. అభివృద్ధి, సంక్షేమంను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడో తీర్మానం చేసినట్లు సమాచారం. నో సీట్ టూ వన్ సీట్, వన్ సీట్ టూ 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించేలా జనసేన బలంగా నిలబడిందని జనసేన అధినేత ఎమ్మెల్యేలతో అన్నారు. జనసేన ప్రాంతీయ పార్టీ అయినా.. సైద్ధాంతికంగా బలమైన జాతీయ వాదం ఉందన్నారు.
Also Read: AP Farmers: ఏపీ రైతులకు శుభవార్త.. అతి త్వరలోనే..!
‘సేనతో సేనాని’ కార్యక్రమం మొదటి రోజు సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు 200 మంది కార్యకర్తలతో జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై ఆరా తీశారు. ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై భేటీలో వివరణ కోరినట్లు తెలుస్తోంది. ప్రతి ఎమ్మెల్యేతో 5-10 నిమిషాలు సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే పనితీరుపై పవన్ చేతిలో సర్వే చేయించిన పవన్.. నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేల తో సమీక్షించారు. రిపోర్ట్స్ ఆధారంగా ఎమ్మెల్యేలకు ర్యాంక్లు ఇచ్చే అవకాశం ఉంది. రేపు పార్లమెంట్ సభ్యులు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జీలు, ముఖ్య నేతలతో పవన్ సమావేశం కానున్నారు.