CM Revanth Reddy: నేడు సచివాలయంలో సీఎం కీలక సమీక్ష.. తడిసిన ధాన్యం సేకరణపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. వ్యవసాయ రంగంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్షించనున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యం సేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించనున్నారు. నేటి నుంచి పరిపాలనపై దృష్టి పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చిట్ చాట్ లో తెలిపిన విషయం తెలిసిందే.. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర పైనే ఎక్కువ ఫోకస్ ఉండే అవకాశం ఉంది. రైతు పండించే వాటిని రేషన్ షాపుల్లో అందించే ఆలోచన చేయనున్నారు. మిల్లర్లు మింగి కూసుంటాం అంటే చూస్తూ ఊరుకోనని రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు కూడా.. విద్యుత్ శాఖలో కొందరు కావాలని పవర్ కట్ చేస్తున్నారని, వారిపై చర్యలు ఉంటాయని రేవంత్ తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం.. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి.. నేటి నుంచి పరిపాలనపై పూర్తి స్థాయి చర్యలు ఉంటాయన్నారు.
Read also: Disha Patani: దిశా పటాని వేసుకున్న ‘లవ్’ షార్ట్ డ్రెస్ ఖరీదెంతో తెలుసా?
Also Read
మరోవైపు.. రిటైర్డ్ ఉద్యోగుల పై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రుణమాఫీ పై ఫోకస్, విద్యాశాఖ, అన్ని హస్టల్స్ కి సన్న బియ్యం అందించే దిశగా మీద ఫోకస్ పెట్టనున్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన సన్న బియ్యం కాదు.. నిజమైన సన్నబియ్యం ఇస్తామని అన్నారు. త్వరలో బ్యాంకర్ల సమావేశం ఉంటుందన్నారు. రుణమాఫీ పై చర్యలు, రైతుల రుణాలు ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం పేర్కొన్నారు. రైతుల రుణాలు మాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. దాని ద్వారా రుణాలు మాఫీ చేసుకోవచ్చని తెలిపారు. దేశంలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సగం కాంగ్రెస్, సగం బీజేపీకి పోతే బీఆర్ఎస్ పార్టీనే ఉండదని విమర్శించారు. కాంగ్రెస్ పై ఎవరు ఏం విమర్శలు చేసినా పట్టించుకోమన్నారు. తాము 13 సీట్లు గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్ కూడా రాదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పోటీ బీఆర్ఎస్ అని.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలేనని.. బీఆర్ఎస్ అదే చేస్తుందని అన్నారు.
Purandeswari: బస్సు యాక్సిడెంట్లో మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపిన పురంధేశ్వరి..
తాజావార్తలు
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?