Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశం కోసం పని చేయాలనే ఆ మహా సైనిక కల నెత్తుటి కన్నీటి మధ్య అర్ధంతరంగా ఆగిపోయింది. ఖాకీ డ్రస్ వేసుకుని దేశ సరిహద్దుల్లో తిరగాల్సిన ఆకళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. కన్నవారి కడుపుకోతను వర్ణించడం ఎవరి తరమౌతుంది? ఛాతి నిండా దేశభక్తితో, కళ్లలో సైనిక వందనాల స్వప్నాలతో అగ్నివీర్ రన్నింగ్ టెస్ట్‌కు పరుగులు పెట్టిన ఆ బిడ్డ నేలకొరగడం చూసి ఆ తల్లి గుండె పగిలిపోయింది.
విశాఖపట్నంలో జరిగిన అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ యువత ఉత్సాహంతో కళకళలాడవలసిన చోట, అపశృతితో కంటతడి పెట్టించింది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన శేషగిరిరావు (19) దేశ సేవే లక్ష్యంగా ఎంతో కష్టపడి ఈ ర్యాలీకి వచ్చాడు. లక్ష్యం వైపు అడుగులు వేయాల్సిన ఆ లేత కాళ్లు, నిర్దేశిత 1.6 కిలోమీటర్ల పరుగు పందెంలో ఒక్కసారిగా తూలిపోయాయి. ఊపిరి సలపని ఆ అంతులేని ఆయాసంలో, పట్టుదలగా పరిగెత్తిన ఆ యువకుడు అకస్మాత్తుగా సొమ్మసిల్లి కిందపడిపోయాడు. అక్కడికక్కడే కుప్పకూలిన అతడిని చూసి తోటి అభ్యర్థులు కన్నీరు పెట్టారు.
Also Read
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
- POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
- 1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
వెంటనే స్పందించిన సిబ్బంది అతడిని అత్యవసర చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని కేజీహెచ్ (KGH) ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ బిడ్డను బతికించుకోవడానికి వైద్యులు శాయశక్తులా ప్రయత్నించారు. కానీ, విధి మరోలా తలచింది. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి బెడ్‌పై కొట్టుమిట్టాడుతూ ఆ యువకుడు చివరకు తుదిశ్వాస విడిచాడు.
దేశాన్ని రక్షించే సైనికుడిగా చూడాలని ఎంతో మురిసిపోయిన పలాసలోని ఆ తల్లిదండ్రులకు ఈ వార్త విని కన్నీరుమున్నీరుగా విలపించారు. కంటికి రెప్పలా పెంచుకున్న బిడ్డ విగతజీవుడిగా మారుతాడని ఆ తల్లిదండ్రులు కలలోనైనా ఊహించి ఉండరు. సైనిక ఉద్యోగం సాధించి ఇంటికి వస్తాడనుకున్న బిడ్డ, ఇలా శవమై తిరిగిరావడంతో ఆ ఊరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేశం కోసం తపించిన ఆ అభాగ్యుడి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థిస్తున్నారు.
తాజావార్తలు
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
ట్రెండింగ్
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!