Disha Patani Mini Dress Pics Goes Viral: ‘లోఫర్’ సినిమాతో దిశా పటానీ సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. 2016లో వచ్చిన ‘ఎంఎస్ ధోనీ-అన్‌టోల్డ్ లవ్‌స్టోరీ’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన దిశా.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భాగీ, భారత్, మలంగ్, ఏక్ విలన్, యోధ, రాధే లాంటి సినిమాలతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే సినిమాల కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే దిశా గుర్తింపు పొందారు.
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా పటానీ డేటింగ్ వ్యవహారం బాలీవుడ్‌లో ఓ హాట్ టాపిక్ అయింది. ఈ ఇద్దరికి సంబంధించిన ఎన్నో ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతారని అందరూ అనుకున్నా.. తాము విడిపోయామని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం దిశా ఫోకస్ మొత్తం సినిమా, సోషల్ మీడియా మీదే ఉంది. సోషల్ మీడియానే అస్త్రంగా చేసుకొని తన పాపులారిటీ రోజురోజుకూ పెంచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు బికినిలో పరువాల విందు ఇస్తూ.. ఫాలోయింగ్ రెట్టింపు కుంటున్నారు. సోషల్ మీడియాలో దిశా క్రేజే వేరు అని ఆమె ఫాలోవర్స్ సంఖ్య చూస్తే అర్థం అవుతుంది.
Also Read: Ravi Shastri: కాలంతో పాటు మారాలి.. ఆ నిబంధన మంచిదే!
తాజాగా ఓ బాస్కెట్‌బాల్ ఈవెంట్ కోసం దిశా పటానీ హాజరయ్యారు. ఆ ఈవెంట్‌లో దిశా షార్ట్ డ్రెస్‌లో మెరిశారు. ముఖ్యంగా రెడ్ హార్ట్ సింబల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబందించిన ఫొటోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పంచుకున్నారు. ఈ షార్ట్ డ్రెస్ ధర రూ.1,08,994 అట. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రాబోతున్న ‘ప్రాజెక్ట్ కే’ దిశా భాగం అవ్వనున్నారు. అలానే సూర్య ‘కంగువ’లో ఆమె నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై దిశా భారీ ఆశలు పెట్టుకున్నారు.