The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే వందల వేల డాలర్లు కొల్లగొడుతూ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్న ఈ సినిమా చుట్టూ ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. సినిమాకున్న విపరీతమైన హైప్‌ను క్యాష్ చేసుకునేందుకు.. ఇండియాలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లను భారీగా పెంచబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ వార్తలతో ఒక్కసారిగా ఫ్యాన్స్, సగటు సినీ ప్రేక్షకుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఈ ప్రచారంపై ‘ది ప్యారడైజ్’ యూనిట్ ను సంప్రదించగా, వారు ఈ వార్తలపై కౌంటర్ ఇస్తూ అసలు నిజాన్ని బయటపెట్టారు. ‘ది ప్యారడైజ్’ టికెట్ ధరల (Hikes) పెంపు గురించి నెట్టింట జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ వట్టి పుకార్లేనని మేకర్స్ తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి టికెట్ రేట్ల పెంపుపై తమలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అసలు ఆ ఆలోచనే ఇప్పటివరకు రాలేదని టీమ్ క్లారిటీ ఇచ్చింది.
సినిమా విడుదలకు సంబంధించిన ఫైనాన్షియల్ వ్యవహారాలు, ప్రైసింగ్ దశకు ఇంకా వెళ్లలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం యూనిట్ మొత్తం కేవలం ‘కంటెంట్ డెలివరీ’ పైనే పూర్తి ఫోకస్ పెట్టిందని తెలిపారు. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ నిరంతరం శ్రమిస్తోందని వివరించారు. అధికారికంగా మేకర్స్ నుంచి ఈ క్లారిటీ రావడంతో ప్రేక్షకులకు పెద్ద రిలీఫ్ దొరికినట్లయింది. రిలీజ్ సమయానికి పరిస్థితులను బట్టి ధరల వ్యవహారంపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే రేట్ల పెంపు అనేది కేవలం ఒక రూమర్ మాత్రమేనని తేలడంతో నాని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఓవర్సీస్ ప్రీమియర్స్‌కే రికార్డులు బద్దలు కొడుతున్న ‘ది ప్యారడైజ్’.. కంటెంట్ డెలివరీ కూడా అదే రేంజ్లో ఉంటే బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది!
Also Read
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!