హుజురాబాద్ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో బీజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. ఉపఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గంలో ప్రచారం ఊదరగొడుతోంది. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇంచార్జ్‌లును నియమించి గ్రౌండ్ వర్క్ చాలారోజుల కిందటే మొదలుపెట్టేసింది.
ఇక ఇది ఇలా ఉండగా.. ఎలాగైనా హుజురాబాద్ నియోజక వర్గంలో గులాబీ జెండా ఎగుర వేసేందుకు సీఎం కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న హుజురాబాద్ నియోజక వర్గంలో పర్యటించనున్నారు కేసీఆర్. అటు కేసీఆర్ పర్యటన ఉన్న నేపథ్యంలో.. మంత్రులు గంగుల మరియు కొప్పుల ఈశ్వర్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.