CM KCR: ఢిల్లీకి పయనమైన అధికారులు.. పలు అంశాలపై సీఎంతో సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థత గురయ్యారు. కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల కోసం ఉత్తరప్రదేశ్ వెళ్లారు. అనంతరం అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లిన ఆయన అప్పటి నుంచి తుగ్లక్ రోడ్డులోని తన నివాసంలో ఉంటున్నారు. గత.. మూడు రోజుల నుంచి సీఎం కేసీఆర్ అస్వస్థతతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో… తన నివాసానికే వైద్యులను పిలిపించుకుని కేసీఆర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు టీఆర్‌ఎస్ శ్రేణులు. సీఎం కేసీఆర్ .. అనారోగ్యం రీత్యా ఆయన మరో రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోని ఉండాల్సి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కావున.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులను అత్యవసరంగా ఢిల్లీ రావాలని కేసీఆర్ ఆదేశించడంతో తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐ అండ్ పిఆర్ కమిషనర్ అరవింద్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు స్పెషల్ ఫ్లైట్ లో హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
Read also: Phone : ఫోన్ తీశాడంటూ బావిలో వేలాడదీశారు.. చిన్నారిపై క్రూరత్వం
Also Read
- Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
- Harish Rao: "త్వరలో భారీ పాదయాత్ర చేయబోతున్నా".. హరీష్ రావు సంచలన ప్రకటన..
- Bhatti Vikramarka: సింగరేణి బొగ్గు గనుల వివాదం.. కేంద్ర ప్రకటనలపై డిప్యూటీ సీఎం ఫైర్
- Kadiyam Srihari: "నేనేం తప్పు చేయలేదు".. మంత్రి కొండా సురేఖ లేఖపై స్పందించిన కడియం శ్రీహరి
ఇక.. హైదరాబాద్ నగరం సొంతం చేసుకున్న వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్‌పై ముఖ్యమంత్రి రివ్యూ జరపనున్నారు సీఎం కేసీఆర్…దీనిపై సమీక్షకు హాజరవాల్సిందిగా సీఎం ఆదేశించారు. దీనికోసం వారంరోజులుగా నిన్ననే దిల్లీకి చేరుకున్నారు. ఇక ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డుపై తగినంత ప్రచారం జరగలేదన్న అసంతృప్తితో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ..అవార్డుపై విస్తృతంగా ప్రచారం నిర్వహించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు మార్గనిర్దేశం చేయనున్నారని సమాచారం. ఇక, వీటితో పాటు మరికొన్ని ఇతర ముఖ్యమైన అంశాలపై కూడా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నాట్లు. అయితే.. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల కోసం వెళ్లిన సీఎం కేసీఆర్ యూపీ వెళ్లిన విషయం తెలిసిందే.. అంత్యక్రియల అనంతరం అక్కడి నుంచి హస్తిన చేరుకున్నారు. అప్పటినుంచి ఎనిమిది రోజులుగా అక్కడి ఉన్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ కోసం సిద్ధమవుతోన్న కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం కార్యాలయంలో మార్పులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఢిల్లీ.. సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు…ఇందుకోసం జోద్‌పూర్ వంశీయుల బంగ్లాను కార్యాలయం కోసం లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
T20 World Cup: టీమిండియా పట్ల వివక్ష.. క్రికెట్ ఆస్ట్రేలియాపై విమర్శల వర్షం
- Tags
తాజావార్తలు
-
Rainbow Hospital: 5వ అంతస్తు నుంచి జారి పడిన బాలుడు.. పునర్జన్మనిచ్చిన రెయిన్బో హాస్పిటల్ వైద్యులు..
-
Sabang Port: మోదీ వ్యూహంతో చైనాకు చెక్.. సబాంగ్ పోర్టు భారత్‌కు ఎందుకు కీలకం?
-
Babar Azam: పాపం పాకిస్థాన్‌కు కెప్టెన్ దొరకట్లే.. మళ్లీ బాబర్ ఆజమ్ చేతికే పాక్ టీ20 పగ్గాలు!
-
Trump–Meloni: టర్కీలో ట్రంప్-మెలోనీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
-
Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..