Phone : ఫోన్ తీశాడంటూ బావిలో వేలాడదీశారు.. చిన్నారిపై క్రూరత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone: సెల్ ఫోన్ తీశాడంటూ క్రూరంగా చిన్నారిని బావిలో వేలాడదీశాడో వ్యక్తి. తాను దొంగతనం చేయలేదని చెప్తున్నా వినకుండా కనికరం లేకుండా ప్రవర్తించాడు. ఈ ఘటనను ఒకరు వీడియో తీస్తూ మరొకరు బావిలో బాలుడిని వేలాడదీశారు. ఈ దృశ్ం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో జరిగింది. లవ్‌కుష్‌నగర్‌లోని అక్టోహాన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం మొబైల్ దొంగతనం చేశాడని బాలుడిని పట్టుకున్న నిందితుడు.. దారుణంగా కొట్టాడు.
Read Also: Weight Loss : బంపర్ ఆఫర్.. బరువు తగ్గితే రూ.1000కోట్ల బహుమతి
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
అంతటితో ఆగకుండా.. 20 అడుగుల లోతైన బావిలో 5 నిమిషాల పాటు ఒక చేత్తో పట్టుకోని వేలాడదీసాడు. తాను దొంగతనం చేయలేదని వేడుకుంటున్నా కనీసం కనికరించలేదు.. ఈ సమయంలో అటుగా వెళ్తున్న ఓ యువకుడు వీడియో తీసి బాధిత చిన్నారి తల్లిదండ్రులకు చూపించాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు బాధిత చిన్నారితో కలిసి లవకుష్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ హేమంత్ నాయక్.. నిందితుడు అజిత్ రాజ్‌పుత్‌పై హత్యాయత్నం, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
Read Also: Newyork : అమెరికాలో విషాదం.. ట్రెక్కింగ్ చేస్తూ గుంటూరు వాసి మృతి
అయితే.. తాను ఈ దృశ్యాన్ని రికార్డు చేసి బాలుడి తల్లిదండ్రులకు చూపించడంతోనే ఈ ఘటన కలకలం రేపిందని.. లేకపోతే.. ఇంత జరిగేది కాదంటూ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి ప్రతా దూబే తనను కొట్టారని.. కులం పేరుతో దూషించారని వీడియో తీసిన వ్యక్తి కిషోర్ ఆరోపిస్తున్నాడు. కాగా.. బావిలో 14 అడుగుల మేర నీరు నిండి ఉందని.. నిందితుడు బాలుడిని వదిలేస్తే చనిపోయేవాడని.. బాధిత బాలుడి తల్లిదండ్రులు పేర్కొన్నారు. వీడియో చూడగానే గుండె తరుక్కుపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా.. దీనిపై ఛతర్ పూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ స్పందించారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని.. పోలీసుల వ్యవహారంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్‌లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!