CM KCR: తమాషాకి అభ్యర్థులను పెట్టొద్దు నిలబడితే గెలవాలంతే..! అంటూ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు మూడు జిల్లాలో పర్యటనలో భాగంగా.. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో టిటీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ కండువా కప్పి సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్ పోయిన… అంత కంటే పెద్ద నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఒక్కొక్క సీటు కౌంట్ అవుతుందన్నారు. అభ్యర్థినీ పెట్టినం అంటే గెలవాలన్నారు సీఎం. పద్మశాలి వర్గం కు టికెట్ ఇవ్వాలని వెతికా.. … సంగా రెడ్డి నుంచి చింత ప్రభాకర్ కు టికెట్ ఇచ్చాం… మరి ఏమి అవుతుంది చూడాలన్నారు.
ఎన్నికల తరువాత ముదిరాజ్ సామాజిక వర్గం నేతలం హైదరాబాద్ లో కుర్చుని మాట్లాడుకుందామన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గంకు రాజకీయంగా మంచి అవకాశాలు ఉంటాయన్నారు. ఎన్నికల తరువాత ముదిరాజ్ లతో సమావేశం అవుతా అన్నారు సీఎం కేసీఆర్. 119 సీట్లల్లో 112 మాత్రమే మన లెక్కలోకి వస్తాయ్ అన్నారు. తమాషాకి అభ్యర్థులను పెట్టద్దు… నిలబడితే గెలవాలని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వృత్తి పరంగా ముదిరాజ్ లకు న్యాయం జరిగిందన్నారు. గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈటెల రాజేందర్ కన్నా పెద్ద మనిషి జ్ఞానేశ్వర్ మన పార్టీలోకి వచ్చారన్నారు. రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయన్నారు. ముదిరాజ్ ల నుండి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలని కేసీఆర్ అన్నారు. నామినేటెడ్ పదవుల్లో ముదిరాజ్ లకు పెద్ద పీట వేస్తామన్నారు.
Ambati Rayudu: యువకులు రాజకీయాల్లోకి వస్తే.. అభివృద్ధి ఎలా ఉంటుందో ఆచరణలో చేసి చూపించారు: అంబటి రాయుడు