NTV Telugu Site icon

KCR Tour: నేడు 4 జిల్లాల్లో కేసీఆర్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదీ

Cm Kcr

Cm Kcr

KCR Tour: సీఎం కేసీఆర్ నేడు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వానతో పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్‌ పర్యటన ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. అదేవిధంగా పంటలు నష్టపోయి రైతులకు సీఎం భరోసా ఇవ్వనున్నారు.

తెలంగాణలో వడగళ్ల వానలు, అకాల వర్షం కారణంగా వరి, జొన్న, ఉద్యాన పంటలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. మామిడి పండు చాలా వరకు రాలిపోయి భారీ నష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పంట నష్టంపై అధికారులు కేసీఆర్‌కు నివేదిక ఇచ్చారు. ఇందులో భాగంగా ఇవాళ సీఎం కేసీఆర్‌ నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు.

సీఎం షెడ్యూల్‌..
ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి రోడ్డుమార్గంలో బేగంపేట ఎయిర్‌ పోర్టుకు బయలుదేరుతారు. అనంతరం 10.15 గంటలకు బేగంపేటలో హెలికాప్టర్‌ ఎక్కి ఖమ్మం జిల్లాకు బయలుదేరుతారు. ఉదయం 11.15 గంటలకు ఖమ్మం జిల్లా బొనకల్‌ మండలం రామాపురం గ్రామానికి చేరుకుంటారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. ఉదయం 11.45 గంటలకు రామపురం గ్రామం నుంచి హెలిక్యాప్టర్‌లో సీఎం కేసీఆర్‌ బయలుదేరుతారు.మధ్యాహ్నం 12.10 గంటలకు మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుంటారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.మధ్యాహ్నం 12.40కి రెడ్డికుంట తండా నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 12.55 గంటలకు వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకుంటారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అడవిరంగాపురం గ్రామం నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.55 గంటలకు కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంటారు. రామచంద్రపూర్‌లో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. మధ్నాహ్నం 2.30 గంటలకు హెలిక్యాప్టర్‌లో లక్ష్మీపురం గ్రామం నుంచి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమవుతారు. మధ్నాహ్నం 3.15 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.30గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకుంటారు.
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Show comments