CM KCR: 14 మంది ప్రధానులు మారినా.. దేశ ప్రజల తలరాత మారలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Speech At Telangana Bhavan: స్వాతంత్రం వచ్చిన తర్వాత 14 మంది ప్రధానులు మారారని, అయినా దేశ ప్రజల తలరాత మారలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్ సహా పలువురు రైతు నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రైతుల పోరాటం న్యాయబద్ధమైనదని, తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని చెప్పారు. చిత్తశుద్ధితో పని చేస్తే.. తప్పకుండా గెలిచి తీరుతామని అన్నారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో తానెన్నో ఆటుపోట్లను ఎదుర్కున్నానని, తెలంగాణలో ఏం చేశామో మీరందరూ ఒకసారి చూడండని, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించండి అని రైతు నేతల్ని సూచించారు.
Bank Loan Fraud: ఎస్‌బీఐకి రూ.95 కోట్ల టోకరా.. నిందితుడి అరెస్ట్..
Also Read
- Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
దేశ రాజధాని ఢిల్లీలో రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు పోరాడారని.. ఆ సమయంలో రైతులను ఉగ్రవాదులని, ఖలీస్తానీలని, వేర్పాటవాదులని విమర్శించారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. అయితే.. రైతులు వెనకడుగు వేయకుండా తమ పోరాటాన్ని కొనసాగించడంతో, ప్రధాని మోడీ దిగివచ్చిన క్షమాపణ చెప్పారని, ఆ చట్టాలని ఉపసంహరించుకున్నారని తెలిపారు. 750 మంది రైతులు చనిపోతే.. ప్రధాని కనీసం స్పందించలేదని మండిపడ్డారు. మన దేశంలో దేనికి కొదవ లేదని.. అయినప్పటికీ రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు రైతులు, చేనేతలు ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకునేవారని.. రైతుల గోస చూసి తన కన్నీళ్లు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని సుస్థిరం చేశామని, దాంతో రైతుల ఆత్మహత్యలు చాలావరకు తగ్గాయని పేర్కొన్నారు. దేశంలో 94 లక్షల ఎకరాల్లో వరి పండితే.. అందులో 56 లక్షల ఎకరాల వరి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే పండుతుందని సీఎం కేసీఆర్ తెలియజేశారు.
Huge Rat: జీవితంలో ఇంత పెద్ద ఎలుకను ఎప్పుడూ చూసి ఉండరు
ఇదిలావుండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్‌తో పాటు కొందరు రైతు నేతలు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చడునీ, మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం, మంత్రులు సత్యవతి రాథోడ్, హరీశ్‌రావు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో పాటు పలవురు నేతలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..