ప్రధాని నరేంద్ర మోడీని దేశం నుంచి తరిమేస్తామంటూ హెచ్చరించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమయంలో.. రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇచ్చారు.. జనగామలో జరిగిన గొడవపై స్పందిచిన కేసార్.. పిడికెడు లేని బీజేపోడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాడని తెలిసింది. బీజేపీ బిడ్డల్లారా మేం మంచివాళ్లం మిమ్మల్ని ఏమీ అనం.. కానీ, మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.. కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం.. మా శక్తి ముందర మీరు ఎంత?…
ప్రధాని నరేంద్ర మోడీ జాగ్రత్త.. నీ ఉడుత ఊపులకు భయపడం అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్… జనగామ బహిరంగసభ వేదికగా.. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు కేసీఆర్.. 8 ఏళ్లుగా పైసా ఇవ్వకపోయినా కేంద్రాన్ని ఏమీ అనలేదన్న ఆయన.. అడ్డగోలుగా ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు.. ఇప్పుడు విద్యుత్ సంస్కరణల పేరుతో కొత్త పంచాయితీ పెడుతున్నారు.. ప్రతీ మోటారుకు విద్యుత్ మీటరు పెట్టాలంటున్నారని ఫైర్ అయ్యారు.. కానీ,…