దక్షిణకాశీగా పేరు గాంచిన వేములవాడ రాజన్నఆలయం అభివృద్ధిదిశగా అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలయిన వేములవాడ రాజన్న ఆలయం కొండగట్టు అంజన్న ఆలయాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధమయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ కు తుదిమెరుగులు దిద్దిన అనంతరం అభివృద్ధి పనులకు అంకురార్పణ చేయనున్నారు.. తెలంగాణలో యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి జరిగి ప్రారంభం అయిన నేపథ్యంలో మరికొన్ని దేవాలయాల అభివృద్ధిపై దృష్టిసారించారు సియం కేసీఆర్.. అందులో భాగంగా వేములవాడలో కొలువున్న శ్రీరాజరాజేశ్వరస్వామి…