నేడు కూడా ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు సీఎం కేసీఆర్. సోమవారం సాయంత్రం మరోసారి కేంద్ర హోం అమిత్ షా తో భేటీ అయ్యారు . తెలంగాణ లో తీవ్రవాద ప్రభావం, అభివృధ్దిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తోనూ.. సోమవారం మరో దఫా చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో వరిధాన్యం దిగుబడి ఐదు రెట్లు పెరిగిందనీ.. కేంద్రం దగ్గర గోడౌన్లు ఖాళీలేకపోతే.. విదేశాలకు ఎగుమతి చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్రమంత్రిని కోరారు సీఎం కేసీఆర్.
గత శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… బిజీబిజీగా గడుపుతున్నారు. శనివారం, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సాగునీటి ప్రాజెక్టులు, పలురకాల అనుమతుల మంజూరుపై నెలకున్న సందిగ్ధత.. తదితర అంశాలపై వినతిపత్రం సమర్పించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్. ఆదివారం, వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్రహోంశాఖ నిర్వహించిన భేటీలో పాల్గొన్న కేసీఆర్… హోమ్ మంత్రి అమిత్ షాతో గంట 45 నిముషాల పాటు సమావేశమయ్యారు.
Also Read
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Off The Record: తెలంగాణలో అధికారమే లక్ష్యం.. సింగరేణి నుంచే ఆపరేషన్ మొదలు?
- Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
- Shiv Charan Reddy: 'నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు'.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
కీలక అంశాలపై చాలాసేపే చర్చించారు ఇద్దరునేతలు. అంతకుముందు, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహరాల మంత్రి పీయూష్ గోయల్ తో తొలి విడతగా భేటీ అయ్యారు కేసీఆర్. ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వనప్పటికీ.. మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని సీఎంకు కేంద్రమంత్రి చెప్పినట్టు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో పరిష్కారం లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు ముఖ్యమంత్రి. ఇవాళ కూడా కేసీఆర్.. ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!