నగరంలో కలుషిత నీళ్లు త్రాగి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కలుషిత నీటిని అరికట్టడం లేదని ఆయన ఆరోపించారు. నిజాం కాలంలో వేసిన పైపులైన్ లే ఇప్పటికి ఉన్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలను విమర్శించిన కేసీఆర్.. ఎనిమిదేళ్లు అయిన సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు. వర్షాకాలం…