Site icon NTV Telugu

Child Trafficking : పసికందుల దందాలో పేరున్న హాస్పిటల్స్.. షాకింగ్ రిపోర్ట్.!

Child

Child

Child Trafficking : సైబరాబాద్ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు సాగుతున్న కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల నుంచి పసికందులను అక్రమంగా తరలిస్తూ హైదరాబాద్ వేదికగా సాగిస్తున్న ఈ దందాలో అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ముఖ్యంగా పుట్టిన రోజు కూడా నిండని పసికందులను తీసుకువచ్చి ఇక్కడ భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి కిడ్నాప్ చేస్తున్నారా లేదా పేద తల్లిదండ్రుల నుంచి కొనుగోలు చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత విస్మయకరమైన విషయం ఏమిటంటే, ఈ అక్రమ రవాణా వెనుక హైదరాబాద్‌లోని దాదాపు 9 ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్ల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోవా IVF, అను ఫెర్టిలిటీ సెంటర్, అంకుర హాస్పిటల్, అక్షయ, హెగ్డే, ఒయాసిస్, పద్మజ , ఫెర్టి-9 వంటి ఆసుపత్రులతో ఈ ముఠా నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Sumathi Sathakam Teaser: నవ్వి.. నవ్వి.. పోతే ఎవరదండి బాధ్యత.. “సుమతీ శతకం” టీజర్ లాంచ్..!

ఈ భారీ నెట్‌వర్క్‌లో నిందితులు ఐవీఎఫ్ (IVF) , సరోగసీ పేరుతో అక్రమ వ్యాపారానికి తెరలేపారు. గుడెప్పు సుజాత, సూరబోయిన అనురాధ, పోతుల శోభ వంటి మహిళా ఏజెంట్ల ద్వారా సరోగేట్ మదర్స్ , ఎగ్ డోనర్లను సరఫరా చేస్తూ, చిన్నారుల విక్రయాలను సాగిస్తున్నారు. హైదరాబాద్ , భువనగిరి పరిధిలో ఇప్పటివరకు సుమారు 15 మంది పసికందులను విక్రయించినట్లు తెలుస్తోంది. ఒక్కో పసికందును సుమారు 4 నుంచి 5 లక్షల రూపాయలకు విక్రయిస్తూ ఈ ముఠా సొమ్ము చేసుకుంటోంది. ఈ ముఠాలోని కీలక నిందితులపై ఇప్పటికే 18 క్రిమినల్ కేసులు నమోదై ఉండటం, గతంలో సంచలనం సృష్టించిన ‘సృష్టి’ కేసులో కూడా వీరు నిందితులుగా ఉండటం ఈ ముఠా ఎంతటి ప్రమాదకరమైనదో అర్థం చేస్తోంది. ముంబై , అహ్మదాబాద్‌లలో కూడా వీరిపై చైల్డ్ ట్రాఫికింగ్ కేసులు ఉన్నాయి.

ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు పలువురు నిందితులను గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకిపల్లి గంగాధర్ రెడ్డి ఈ ముఠాలో కీలక పాత్ర పోషించగా, నోవా , పద్మజ హాస్పిటల్స్‌కు ఐవీఎఫ్ ఏజెంట్‌గా పనిచేస్తున్న వేముల బాబు రెడ్డి కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. వీరితో పాటు హర్ష రాయ్, సంగీత దేబి, రామ్ హరి రాయ్, దారం లక్ష్మి వంటి వారు అరెస్టయ్యారు. అయితే బాబా భాస్కర్, గుజరాత్‌కు చెందిన యూనిస్, శ్రీదేవి, బాబు రావు వంటి మరికొందరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మానవత్వానికే మచ్చ తెచ్చేలా పసికందుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ముఠా వెనుక ఉన్న ఆసుపత్రి యాజమాన్యాల పాత్రపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

CM Chandrababu: మెడికల్ కాలేజీల టెండర్లపై సీఎం కీలక వ్యాఖ్యలు.. తగ్గేదేలే..!

Exit mobile version