Child Trafficking : సైబరాబాద్ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు సాగుతున్న కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల నుంచి పసికందులను అక్రమంగా తరలిస్తూ హైదరాబాద్ వేదికగా సాగిస్తున్న ఈ దందాలో అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ముఖ్యంగా పుట్టిన రోజు కూడా నిండని పసికందులను తీసుకువచ్చి ఇక్కడ భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి కిడ్నాప్ చేస్తున్నారా లేదా పేద తల్లిదండ్రుల నుంచి…