Sumathi Sathakam Teaser: విషన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన మరియు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “సుమతీ శతకం”. బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో టేస్టీ తేజ, మహేష్ విట్ట, జేడీవీ ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తుండగా, ఎస్ హలేష్ సినిమాటోగ్రఫీ, నహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేశారు. 2026 ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం టీజర్‌ను ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు చేతుల మీదుగా అంగరంగ వైభవంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. “టీజర్ చూస్తేనే సినిమా పెద్ద హిట్ అవుతుందని అర్థమవుతుంది. చిత్ర బృందం అందరికీ అభినందనలు” అని కోరారు.
Shivaji Press Meet: నేను ఎవరితోనూ మిస్ బిహేవ్ చేయలేదు.. నా భార్యకు క్షమాపణలు చెప్పాను..
నటుడు అశోక్ కొల్ల మాట్లాడుతూ.. టీజర్ చాలా బాగుందని, చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం కూడా భారీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర అతిథులు కంటమనేని శివ, బెల్లంకొండ సురేష్, వంశీ నందిపాటి కూడా చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. వంశీ నందిపాటి టీజర్ రిఫ్రెషింగ్‌గా అనిపించిందని ప్రత్యేకంగా ప్రశంసించారు.
కొమ్మాలపాటి శ్రీధర్, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, యశ్ని గౌడ, నటుడు అర్జున్ అంబటి, నిర్మాత సాయి సుధాకర్ కొమ్మాలపాటి, హీరోయిన్ శైలి చౌదరి, దర్శకుడు ఎంఎం నాయుడు, హీరో అమర్‌దీప్ చౌదరి కూడా కార్యక్రమంలో మాట్లాడారు. వారందరూ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక సందేశాత్మక చిత్రమని, మంచి తెలుగుతనం ఉన్న టైటిల్‌తో రూపొందిందని చెప్పారు.
Shivaji: నేనేం సిగ్గు పడను.. నేను మాట్లాడిన ఇంటెన్షన్ వేరు..!
నిర్మాత సాయి సుధాకర్ కొమ్మాలపాటి మాట్లాడుతూ.. అమర్‌దీప్‌ను ఈ తరం రవితేజలా చూసి హీరోగా తీసుకున్నట్టు తెలిపారు. శైలి చౌదరిని తెలుగుతనం ఉన్న అమ్మాయిగా ఎంచుకున్నామని చెప్పారు. ఇక హీరో అమర్‌దీప్ మాట్లాడుతూ.. సినిమాలో మంచి కంటెంట్, అద్భుతమైన పాటలు, డాన్స్ స్టెప్స్ ఉంటాయని, ప్రేక్షకులు సపోర్ట్ చేసి విజయాన్ని అందించాలని కోరారు.