హవాలా లావాదేవీలకు సంబంధించి క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కుమార్, అతని సహచరుడు మాధవరెడ్డి, సంపత్ లను ఇవాళ ఈడీ వరుసగా మూడోరోజు విచారణ చేపట్టింది. మొదటి,రెండవ రోజుల్లో సుధీర్ఘంగా విచారించిన ఈడీ, క్యాసినో పేరుతో విదేశాలకు తరలించిన నగదు ఎంత? ఎవరిది అనే కోణంలో విచారణ చేపట్టింది. విదేశీ బ్యాంక్ ఖాతాలను ఇప్పటికే గుర్తించిన ఈడీ, హైదరాబాద్ లో జరిగన చెల్లింపుల్లో హవాలా ఏజంట్ల పాత్రపై విచారణ జరుపుతుంది. సీనీ స్టార్స్, రాజకీయ నేతలు, వీఐపీల పాత్రపై ఈడీ ఆరా చేస్తుంది. దీంతో.. ఈడీ నోటీసుల ఊహాగానాలపై అనుమానితుల్లో ఆందోళన నెలకొంది.
read also: Vice President Election: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌కు మాయావతి మద్దతు
అయితే ఆగస్టు 1,2 తేదీలలో హవాలా లావాదేవీలకు సంబంధించి క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కుమార్, అతని సహచరుడు మాధవరెడ్డి తదితరులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వరుసగా రెండు రోజులు ప్రశ్నించారు. బషీర్‌బాగ్‌లోని ఇడి కార్యాలయంలో ప్రవీణ్ కుమార్‌ను రెండు గంటల పాటు విచారించారు. అతని అక్రమ కార్యకలాపాల గురించి సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నించారు. విచారణ ముగిసిన అనంతరం ప్రవీణ్ కుమార్ తగిన సమాధానాలు చెబుతూ విచారణకు సహకరించినట్లు తెలిపారు.
తన సోషల్ మీడియా ఖాతాలను గుర్తుతెలియని వ్యక్తులు ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇతరులలో వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేశారని అతను చెప్పాడు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో తప్పుడు ఖాతాలు సృష్టించిన వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, విచారణలో దర్యాప్తు సంస్థకు సహకరిస్తానని ప్రవీణ్ కుమార్ తెలిపారు. అనంతరం ప్రవీణ్‌కుమార్‌తో ఆర్థిక లావాదేవీలు జరిపినందుకు మాధవరెడ్డి, సంపత్‌లను ఈడీ అధికారులు గ్రిల్ చేశారు. వారి హవాలా లావాదేవీలకు సంబంధించి ఫారిన్ ఎక్స్ఛేంజ్ అండ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రవీణ్ కుమార్‌తో కొందరు రాజకీయ నేతలు, వీవీఐపీలు, టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు సంబంధాలు పెట్టుకున్నట్లు గుర్తించినట్లు సమాచారం.
Dollars: అప్పడాల మాటున అమెరికా డాలర్లు..!